ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ప ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా కొనసాగింది. అనంతరం నగరంలోని కేఎన్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. వైసీపీ నేతలకు అనుకూలంగా అధికారుల వ్యవహరిస్తున్నారని, దొంగ ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నారంటూ బీజేపీ నాయకులు రోడ్లపై భైటాయించి ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఓటు గల్లంతైంది. ఆయనతో పాటు ధర్మశ్రీ కుటుంబ సభ్యులకు చెందిన 12 ఓట్లు గల్లంతైయ్యాయి. దీంతో ధర్మశ్రీ తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఓట్ల గల్లంతైన విషయంపై ఎన్నిల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద పదవ తరగతి చదివిన మహిళ గ్రాడ్యుయేటే ఓటు వేసేందుకు వచ్చారు. అక్కడ ఉన్న మీడియా ఆమెను ప్రశ్నించగా పదో తరగతి చదివాను అని సమాధానం ఇచ్చింది. డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నారు అంటూ ప్రశ్నించగా, ఆమె మౌనం దాల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం 146 నుంచి ఓటర్ లిస్ట్ ను వైసీపీ ఏజెంట్ తీసుకువెళ్లడంతో టీడీపీ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. దీంతో 15 నిమిషాలు పోలింగ్ నిలిపివేసి మళ్లీ కొనసాగించారు. హిందూపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సే ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి విమానంలో వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి తేజ రెడ్డికి తన ఓటు గల్లంతు అవ్వడంతో నిరాశతో వెనుతిరిగారు.
పలు కేంద్రాల్లో పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్ లో ఉన్నవారందరూ ఓటు హక్కు కల్పించుకునే అవకాశం కల్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్దివాదం జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీటీడీ చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారావు స్థానికేతరుడైనా విశాఖలో ఉండటాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఏపిలో మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు సంఘటన మధ్య ముగిసింది.
ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?