25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో ఆ కంటెస్టెంట్ కి మద్దతుగా రంగంలోకి దిగిన రాంగోపాల్ వర్మ..!

Share

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ హౌస్ కి.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి అవినాభావ సంబంధం ఉంది. రాంగోపాల్ వర్మతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్లు ఎక్కువగా ఈ షోలోకి వస్తూ ఉంటారు. గతంలో అరీయనా, అషు రెడ్డి.. రావటం జరిగింది. అయితే ఈ ఇద్దరిలో సీజన్ 4లో అరీయనానీ ఆర్జీవి సపోర్ట్ చేయడం జరిగింది. సీజన్ ఫోర్ లో అరీయనా… అద్భుతమైన గేమ్ ఆడుతూ మరోపక్క.. మాట్లాడే విషయంలో చాలా క్లియర్ పాయింట్ తో ఉండేది. దీంతో టాప్ ఫైవ్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 6లో ఇనాయా సుల్తానాకి ఆర్జీవి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇనాయా మూడో వారం నామినేషన్ లో ఉండటం జరిగింది.

director ram gopalvarma supports inaya sultana
Bigg Boss 6

చాలావరకు ఇంటిలో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ లు.. ఇనాయానే టార్గెట్ చేసుకుని గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా గీతు రాయల్…ఇనాయా నీ గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది. హౌస్ లో గీతు మొట్టమొదటి గొడవ ఇనాయా తోనే పెట్టుకోవడం జరిగింది. ఇక తర్వాత గేమ్ పరంగా ఇనాయాకి.. రేవంత్, శ్రీ హన్ లతో మూడో వారం పెద్దగానే గొడవ జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం ఓటింగ్ పోల్స్ ముగుస్తున్న క్రమంలో రాంగోపాల్ వర్మ.. ఇనాయాకి ఓటు వేసి.. హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండా చూసుకోవాలని ట్విటర్ లో పోస్ట్ పెట్టారు.

director ram gopalvarma supports inaya sultana
Bigg Boss 6

అంతేకాదు ఆమెకు ఓటు వేయాల్సిన ఫోన్ నెంబర్స్..లింక్స్ పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ వారం నామినేషన్ లో ఉన్న ఇనాయా సుల్తానా.. సేవ్ అయితే ఆ క్రెడిట్ రాంగోపాల్ వర్మకి దక్కుతుందని ఆడియన్స్ అంటున్నారు. ఇనాయా గేమ్ పరంగా మంచి పోటీ ఇస్తున్నా.. కానీ ఆమె ఇతరులతో మాట్లాడే తత్వం ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. ఏదైనా డిస్కషన్ చేస్తున్న సమయంలో ఎదుటివారిని మాట్లాడనివ్వకుండా ఆమె డామినేట్ చేస్తూ ఉండటం..కూడా బయట నెగిటివ్ గా ప్రోజెక్టు అవుతోంది. ఈ విషయాలలో ఇనాయా సరి చేసుకుంటే ఆమెకు తిరుగుండదని అంటున్నారు.


Share

Related posts

Bigg Boss 6: చాలా వారాల తర్వాత ఓటింగ్ లో రేవంత్ ని వెనక్కి నెట్టేసాడు..!

sekhar

Bigg Boss 6: గత సీజన్ లకి… ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి తేడా ఇదే..??

sekhar

Bigg Boss 6: హౌస్ లో శ్రీహాన్ కి సర్ప్రైజ్ ఇచ్చిన సిరి..!!

sekhar