NewsOrbit
Featured బిగ్ స్టోరీ

కేంద్రానికి జగన్ మార్క్ షాక్..!! ఇక..కోర్టులోనే..!!

రాజధానుల చట్టం పైన అఫిడవిట్ దాఖలు

ప్రత్యేక హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు

ఏపీలో మూడు రాజదానులు..సీఆర్డీఏ చట్టం రద్దు పై జరుగుతున్న న్యాయ పోరాటంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం చేసిన చట్లాలపైన హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలను..అమల్లోకి తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ల పైన ఈ నెల 14లోగా ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం కోర్టులో దాఖలైన పిటీషన్లకు సమాధానంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం అఫిడవిట్ లో చెప్పిన విషయాన్ని మరో సారి స్పష్టం చేసింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న రాజధాని..ప్రాజెక్టులను సమీక్షించే అధికారం సైతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని నివేదించింది. పిటీషనర్లు చట్టాల అమలు కాకుండా అడ్డుకొనేందుకు దాఖలు చేసిన పిటీషన్లు విచారణకు అర్హత లేనివిగా పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్ర విభజన చట్టం గురించి..ప్రత్యే హోదా గురించి ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు న్యాయ పరంగానే కాదు.. రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారాయి. కేంద్రం సైతం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వాదన మొదలైంది.

 

ap special status
ap special status

హైకోర్టులో ఏపీ అఫిడవిట్ దాఖలు

అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టం రద్దు పైన దాఖలైన పిటీషన్లకు సమాధానంగా ఏపి ప్రభుత్వం హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. అందులో ఇప్పటికే కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాజధాని పైన నిర్ణయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం అంటూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ లో పేర్కొంది. రెండు చట్టాల కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లలో చేస్తున్న వాదన అర్దరహితమని నివేదించింది. రాష్ట్రంలో రాజధానితో సహా ప్రాజెక్టులు..డెవలప్ మెంట్ యాక్టివిటీ వంటి అంశాలలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసు కునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొందరు ప్రతిపక్ష నేతలు..పిటీషనర్లు రాజధానుల వ్యవహారం పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంతో సంబంధం ఉందని..పునర్విభజన చట్టంలో సవరణలు లేకుండా రాజధానుల నిర్ణయం తీసుకొనే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదనే వాదన వారంతా బలంగా వినిపించారు. దీంతో..ఈ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అంశం పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. దీని ద్వారా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

 

cm jagan (file photo)
cm jagan file photo

విభజన చట్టం ..హోదా అంశాల ప్రస్తావన

ఏపీ పునర్విభజన చట్టం తో ఏపీ రాజధాని అంశం ముడి పడి ఉందనే దానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేందుకు కొన్ని అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టంలో అన్ని అంశాలు అమలు కాలేదని చెప్పుకొచ్చింది. పార్లమెంట్ లో చెప్పిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పునర్విభజన చట్టం పూర్తిగా అమలు అయినట్లుగా భావించాల్సి ఉంటుందని..ఇదే అంశం పైన తాము ప్రతీ సందర్బంలోనూ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొనట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే, ఇప్పటికే కేంద్రం..బీజేపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని..అది సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. అయినా..ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధానుల పైన జరుగుతున్న న్యాయ వివాదంలో ఈ అంశాన్ని ప్రస్తావించటం తో ఇది న్యాయ పరంగానే కాకుండా..రాజకీయంగానూ చర్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా తాము హోదా గురించి ప్రస్తావించటం లేదనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా వైసీపీ చెప్పుకొనే వెసులుబాటు ఏర్పడింది. కేంద్రం హోదా విషయంలో అన్యాయం చేసిందనే అంశాన్ని తాము కోర్టులోనూ ఫైట్ చేస్తేన్నామనే అంశం వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, ప్రభుత్వం ఇప్పుడు హోదా అంశాన్ని ప్రస్తావించటం ద్వారా ఈ రాజధానుల వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠ రాజకీయంగా నెలకొని ఉంది.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju