NewsOrbit
బిగ్ స్టోరీ

మహానాడు పూర్తయిన 24 గంటల్లోనే చంద్రబాబు కి ఊహించని వార్త!

 

సాధారణంగా ప్రజల ప్రయోజనాలు మరియు వారి అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పని చేయాలి. అంతేకానీ కక్ష సాధింపు చర్యలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే సభల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కానీ నయాపైసా ఉపయోగం కూడా ఉండదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి అర్ధం కానట్లుంది. ప్రతి సంవత్సరం టిడిపి నిర్వహించుకునే ‘మహానాడు’ ఈసారి డిజిటల్ మహానాడు గా జరిగిన విషయం తెలిసిందే. సాధారణంగా మూడు రోజులు జరిగే మహానాడుని కరోనా ప్రభావం వల్ల రెండు రోజులకే కుసించారు. ప్రతి సంవత్సరం అయితే ఈ మహానాడు లో పార్టీ లోని లోపాలు మరియు పార్టీ కేడర్ ను పటిష్టం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తారు.

కానీ ఈసారి మహానాడు అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. జరిగిన రెండు రోజులు కూడా కేవలం జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికే సమయం మొత్తాన్ని ఉపయోగించారు. చంద్రబాబు ఈసారి వారి నాయకుల మధ్య జరిగిన చర్చలు మరియు చేసుకున్న తీర్మానాల తీరు విచిత్రంగా ఉంది. రెండు రోజులు జరిగిన ప్రసంగాలు అన్నీ జగన్ చుట్టూ తిరగడం మరియు చంద్రబాబు గత పాలనను పొగడటం…. జగన్ చేస్తున్న ప్రస్తుత పాలనపై బురద చల్లడంతోనే కాలం గడిచిపోయింది. సరే ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడంలో తప్పేముంది అని అనుకుందా…. అయితే ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలకు ఇక్కడ జగన్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం?

మహానాడు జరిగిన 24 గంటల్లో బయటకు వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తే చంద్రబాబు కి పెద్ద షాక్ తగిలింది అనే చెప్పాలి. ఈసారి మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోగా ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు మరియు ప్రతిపక్షాలు చేసిన రచ్చ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక అన్నదాత వెన్నువిరవటం గురించి కూడా తప్పుడు ఆరోపణలు, కథనాలే రాయిస్తున్నారు అని రిపోర్టులు తేల్చి చెప్పేశారు. ఇక రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశారు అన్నదానికి ఆధారాలు లేవు కానీ అధికార పార్టీ మాత్రం నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయడం ఇంకా ఏడాది కాకుండానే రెండుసార్లు అకౌంట్లోకి నగదు జమ చేసిన తీరు ఇప్పుడు బాబు అన్న మాటలను నవ్వులపాలు అయ్యేలా చేసింది.

ఇదిలా ఉండగా కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం పంటలను పొలాల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసింది. ఇన్ని సానుకూలాంశాల మధ్య మరలా సాగునీటి ప్రాజెక్టులు సంక్షోభంలో పడ్డాయి అవాస్తవ ప్రచారానికి మహానాడుని ఉపయోగించుకున్న తీరు రిపోర్ట్ లో స్పష్టంగా కేంద్రీకృతమైంది. కరోనా సంక్షోభం కారణంగానే పోలవరం తదితర ప్రాజెక్టుల పనులు ఆగాయని బాబు తెలుసుకోలేని తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటానికి, బురద చల్లటానికే మహానాడు పరిమితం కాకుండా ఆత్మ పరిశీలన కూడా చేసుకునుంటే బాగుండేది.. లేకపోతే ఇటువంటి మహానాడులు ఎన్ని జరుపుకున్నా ఉపయోగం ఉండదని చంద్రబాబు గ్రహించాలి.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju