NewsOrbit
బిగ్ స్టోరీ

తెలంగాణ రాజకీయం కాంగ్రెస్, బీజేపీకి అర్థంగావడం లేదా?

 

భారీ వర్షం కురుస్తుంటే పెద్దపెద్ద ఇంకుడు గుంతలు తవ్వి నీళ్లను నిల్వ చేసుకోవాలిసిన ప్రతిపక్షాలు కనీసం చిన్నగ్లాసులో కూడా వాటర్ పట్టుకోలేకపోతున్నాయి… ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి.

 

 

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గానీ, తెలంగాణ రాష్ట్రం సిద్దించడానికి ఇతోదిక సహయం చేసిన బీజేపి గానీ తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కుకోలేకపోతున్నాయి. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజేతులా వదులుకుంటున్నారనే అపవాదును ప్రతిపక్షాలు మూటగట్టుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటారనే పేరున్న కమ్యూనిస్టుల కానరావడం లేదు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఊసే లేకుండా పోయింది. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలిసిన ప్రతిపక్షాలు మౌనంగా ఉంటున్నాయి. ప్రతిపక్షపార్టీలలోని నేతలు సొంత ఇమెజ్ ఫెంచుకునేందుకు ఉమ్మడిగా చేయాలిసిన కార్యక్రమాలను ఒంటరిగా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవ్వన్ని అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసొస్తున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో ప్రజల చూపు సాధారణంగానే కేసీఆర్ వైపు ఉంది. ఇది అనేక ఎన్నికల ద్వారా నిరూపితమవుతూనే ఉంది.

సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అంటూ సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో ప్రకటించారు. అనేక ఏళ్లుగా సుదీర్ఘ పోరాటాలు, ఉమ్యమాలు నడిచినప్పటికి సోనియాగాంధీ పట్టుదల కారణంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయింది. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కాగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆధారాభిమానాలను పొందాయి. తెలంగాణ ప్రజల ఆధారాభిమానాలను సొంతం చేసుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీ సాధారణంగానే ఎక్కడైన అధికారంలోకి వస్తుంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల కారణంగా 2014లో 63 అసెంబ్లి సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. చేసిన తప్పులనుండి గుణపాఠం నేర్చుకుని పార్టీ పునర్ వైభవం కోసం శ్రమించాలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందుకు బిన్నంగా వ్యవహరించారు. గ్రూప్ లుగా విడిపోయారు. ఎవరికివారే యమునతీరే అనే చందంగా ముందుకుపోయారు. ఉమ్మడిగా చేయాలిసిన కార్యక్రమాలను ఒంటరిగా చేస్తు సొంత ఇమెజ్ కోసం పాకులాడారు. దీని కారణంగా 2018 అసెంబ్లి ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, సహకార ఎన్నికలు ఇలా ఎన్నికలు ఏవైనా తెలంగాణలో గెలుపు టీఆర్ఎస్ సొంతమవుతూ వస్తుంది. దీనికంతటికి కారణం రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఫల్యమే అనే వాధన బలంగా ఉంది. చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు టీఆర్ఎస్ అధిష్టానానికి కోవర్ట్ గా పనిచేస్తున్నారనే భావన కూడా తెలంగాణ ప్రజలల్లో ఉంది.

రెండు టర్మ్ లు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తెలంగాణలో పుంజుకోలేక పోతుంది. దక్షణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనే బీజేపి సంకల్పం ఇప్పట్లో నేరవేరే పరిస్థితి కనిపించట్లేదు. ప్రధాని నరేంద్రమోడి హవా కారణంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు బీజేపి అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. అప్పటినుండి తెలంగాణలో బీజేపి పుంజుకుంటుందని అందరు భావించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఇచ్చిన బూస్టప్ ని బీజేపి నాయకత్వం అందిపుచ్చుకుంటుంది… నిత్యం ప్రజాక్షేత్రంలో నేతలు ఉంటారు. ప్రజాసమస్యలపైన పోరాటాలు చేస్తారని ప్రజలు భావించారు. కానీ బీజేపిలో అందుకు భిన్నంగా జరుగుతుంది. కేవలం పదవుల్లో ఉన్న నేతలు మినహ మిగితావారు నాకేందుకులే అనే ధోరణలో ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటించిన ప్రతీసారి రాష్ట్రప్రభుత్వ పనితీరును కీర్తీంచడం… కీసీఆర్ నాయకత్వాన్ని పొగడడం బీజేపికి ఎదుగుదలకు గుదిబండలా మారందని సాక్ష్యాత్తు రాష్ట్ర నాయకులే వ్యాఖ్యనిస్తుంటారు.

ప్రజాసమస్యలపై పోరాటాలకు అనాధిగా పెట్టింది పేరుగా ఉన్న ఎర్రజెండా పార్టీల జాడే లేదు. గుండు సూది బ్యాచ్, దంబుడం బ్యాచ్ అంటూ నిండు అసెంబ్లీలో మఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసినప్పటికి స్పందిచిన నాయకులే లేరు. సుదీర్ఘకాలంగా కమ్యూనిస్ట్ నాయకులుగా ఉన్నవారు కూడా గులాబి గూటికి చేరుకున్నారు. వీరి కారణంగా ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ బలంగా మారింది.

తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశంపార్టీ తెలంగాణలో ఊసే లేకుండా పోయింది. పదే పదే రెండు కళ్ల సిద్దాంతాన్ని వల్లించిన ఆపార్టీ అధినేత వైఖరి కారణంగానే తెలుగుదేశం తెలంగాణలో లేకుండా పోయిందనే భావన ఆపార్టీ క్యాడర్ లోనే ఉంది. టీడిపీలో ఉండే ముఖ్యమైన నేతలందరు కారులో ఎక్కి షికారు చేస్తున్నారు.
ఉధ్యమ నాయకునిగా సక్సస్ అయిన తెలుగాణ ప్రజాఫ్రంట్ అధినేత కొదండరాం రాజకీయ నేతగా విఫలమయ్యాడనే అపవాదును ఇప్పటికే మూటగట్టుకున్నారు.

ఇలా… తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాటగా చెలమణి అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రాణాంతక కరోన వైరస్ ప్రజలను పట్టిపీడిస్తుంటే 500కోట్ల రూపాయల నిధులతో నూతన సచివాలయం నిర్మించేందుకు కేసీఆర్ కార్యోన్ముఖుడయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రులు మ్రుత్యు కుహరాలుగా మారాయి. ప్రైవేట్ ఆస్పత్రులు లక్షలాది రూపాయలు లాగుతూ నరకం చూపిస్తున్నాయి. పొరుగు రాష్రంలో లక్షలాది టెస్టులు చేస్తుంటే తెలంగాణలో టెస్ట్ లు ఉండవు. కరిన వైరస్ సోకిన వారికి ట్రీట్ మెంట్ ఉండదు. దీనంతటికి కారణం అడిగేవారు లేరనే ధీమానే అని ప్రజలు భావిస్తున్నారు.                                                                                                    (సుధాకర్)

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju