NewsOrbit
బిగ్ స్టోరీ

రాజధాని బిల్లులలకు గవర్నర్ ఆమోదం

జగన్ ప్రభుత్వానికి భారీ రిలీఫ్…ఇక మూడు రాజధానులు..!కోర్టు మెట్లు ఎక్కనున్న ప్రతిపక్షాలు..!!

 

ఈ మధ్య కాలంలో సీఎం జగన్ కు ఇది భారీ రిలీఫ్. గత ఏడాది డిసెంబర్ నుండి చేస్తన్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా తీసుకువచ్చిన బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం…ఆమోదం కోసం గవర్నర్ కు నివేదించింది. దీని పైన ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున గవర్నర్ పైన ఆమోదించవద్దంటూ ఒత్తిడి తెచ్చాయి. అమరావతి జేఏపీ లేఖలు రాసింది. మండలి లో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ ఆదేశించినా..తిరిగి సభలో బిల్లులు ప్రవేశ పెట్టారని.. ఇది కేంద్రం తీసుకొచ్చిన రాష్ట్ర విభజన బిల్లుతో ముడిపడి ఉండటంతో రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరంటూ ప్రతిపక్ష టీడీపీ వాదించింది. అయితే, న్యాయ నిపుణలు సలహాలు స్వీకరించిన గవర్నర్ ఏపీ శాసన వ్యవస్థ ఆమోదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులకు ఆమోద ముద్ర వేసారు. దీంతో..ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయనేది ఆసక్తి కరంగా మారింది.

సీఆర్డీఏ రద్దు.. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం..ముఖ్యమంత్రి జగన్ కోరుకున్నట్లుగా ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. గత డిసెంబర్ 17న ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పైన సూత్రప్రాయంగా తన ఆలోచనలను శాసనసభ ముందుంచారు. అప్పటికే ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీలు సైతం పరిపాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. దీంతో..ప్రభుత్వం జనవరి 20న ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కమిటీ రిపోర్టులను..ఈ రెండు బిల్లులను ఆమోదించింది. అదే రోజు శాసనసభలో ప్రభుత్వం ప్రతిపాదించగా..ఆ బిల్లులను శాసనసభ ఆమోద మెద్ర వేసింది. ఆ మరుసటి రోజునే శాసనమండలిలో బిల్లులను టీడీపీ అడ్డుకుంది. రెండు రోజుల చర్చోపచర్చల తరువాత మండలి ఛైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా ప్రకటించారు. కానీ, సెలెక్ట్ కమిటీకి పంపే అంశంలో అనేక న్యాయ..సాంకేతిక అంశాలు అడ్డు రావటంతో అవి సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదు. తిరిగి గత నెలలో జరిగిన సమావేశాల్లో ఇవే బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. శాసనసభలో తిరిగి ఆమోదం పొందిన బిల్లు..మండలిలో టేబుల్ అయింది. అయితే మండలిలో ఆమోదంలేదా తిరస్కరణ లేకుండా సమావేశాలు వాయిదా పడ్డాయి. నెల రోజుల తరువాత బిల్లులు డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ గా భావిస్తూ వాటి ఆమోదానికి ప్రభుత్వం గవర్నర్ కు పంపిది. అనేక అభిప్రాయాల సేకరణ తరువాత గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించారు.

ఇక మూడు రాజధానులు..ప్రతిపక్షాల న్యాయ పోరాటం.ఇప్పుడు గవర్నర్ ఈ రెండు బిల్లులను ఆమోదించటంతో ఏపీకి ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా మూడు రాజధానులు ఉండనున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ..న్యాయ రాజధానిగా కర్నూలు.. శాసన రాజధానిగా అమరావతి ఉండనున్నాయి. అయితే, ఇప్పటికే వీటికి సంబంధించి పలు కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీం కోర్టులోనూ కేసు దాఖలు చేసారు. వీటి పైన కోర్టు ఎటువంటి మర్గదర్శకాలు ఇవ్వలేదు. బిల్లులు చట్ట రూపంలోకి వచ్చే అవకాశం ఉందని..దీని పైన ముందస్తు ఉత్తర్వులు ఇవ్వాలంటూ తాజాగా కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన అమరావతి జేఏసీ నేతలు అభ్యర్ధించగా..తాము పరిగణలోకి తీసుకుంటామని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ప్రతిపక్షాలు గవర్నర్ కు లేఖల ద్వారా బిల్లులు ఆమోదం పొందకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసాయి. బిల్లులను ఆమోదించుకుండా..కేంద్రం ఆమోదించిన ఏపీ పునర్విభజన బిల్లుతో ముడి పడి ఉన్న అంశం కావటంతో దీనిని రాష్ట్రపతికి పంపాలని కోరారు. కానీ, గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరించి..చివరకు ఈ రెండు బిల్లులను ఆమోదించారు. ప్రతిపక్షాలు ఎంతగా అడ్డుకున్నా..ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ పూర్తవుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుండగా..ప్రతిపక్షాలు దీని పైన న్యాయ సమీక్షకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju