NewsOrbit
Featured బిగ్ స్టోరీ

పవన్ ని ముంచుతున్నదెవరు…? కాపులా..? ఫ్యాన్సా…?

ఈ మధ్య ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ విపరీతంగా కనిపిస్తున్నారు. అప్పుడెప్పుడో రెండు నెలల తర్వాత ఉన్న పుట్టినరోజుని ఇప్పటి నుండీ హడావిడి చేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 27 . 3 మిలియన్ల ట్వీట్లతో హల్చల్ చేసారు. ఏ హీరోకి ఇంతటి ఫాలోయింగ్ లేదు, ఇంతటి వీరాభిమానులు లేరు. కానీ ఎందుకు ఓడిపోయారు..? రెండు చోట్లా ఎందుకు ఓడిపోయారు..? పవన్ ని ఎన్నికల సమయంలో ముంచింది ఎవరు..? ఇప్పటికీ ముంచుతున్నది ఎవరు…? కాపులా…?? ఫ్యాన్సా…? బీజేపీనా …???

లెక్కలు తప్పుతున్నాయి…!

పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్యానూ కాపు ఓటరు కానక్కరలేదు..! ప్రతి కాపూ ఓటరు పవన్ కళ్యాణ్ ఫ్యాను కానక్కరలేదు..! కానీ కాపు ఓటరు అయి, పవన్ కళ్యాణ్ ఫ్యానుగా కూడా ఉంటే మాత్రం జనసేన కార్యకర్తగా మారతారు. అలాంటి వారు కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్నారు. కానీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. కాపు ఓటింగ్ ఎక్కువగానే ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. నిజాలు దాచేయాలి అనుకుంటే కారణాలుగా “అక్కడ టీడీపీ, వైసీపీ కలిసిపోయాయి..! అక్కడ ఆ రెండు పార్టీలు కలిసి డబ్బులు పంచాయి…! మా పవన్ అసెంబ్లీకి వస్తే ఈ రెండు పార్టీల ఆటలు సాగవని ఓడించేసారు…! అక్కడ మా బాస్ ప్రచారం చేయలేదు…!!! ఇలా ఎన్నో కారణాలు చెప్పుకుని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సమాధానపరుచుకోవచ్చు. నిజాలను దాచేసుకోవచ్చు. కానీ

 

* ఏ నియోజకవర్గంలోనూ పార్టీ నిర్మాణం జరగలేదు.
* ఏ నియోజకవర్గంలోనూ బూత్ స్థాయిలో సమన్వయము చేయట్లేదు.
* ఏ నియోజకవర్గంలోనూ ఎన్నికల ముందు వరకు అభ్యర్థిపై స్పష్టత లేదు.* 2014 నుండి 2019 ఫిబ్రవరి వరకు నిద్రపోయి.., అప్పుడప్పుడూ పత్రిక ప్రకటనలకు పరిమితమైన నాయకులూ ఇప్పుడు కూడా యూట్యూబ్, పేస్ బుక్, పత్రికల్లో ప్రకటనలకు పరిమితమయ్యారు. అనే నిజాలను చెప్పరు. ఒప్పుకోరు. కాపులు, ఫాన్స్ కలిసి పనిచేయాలన్న సూత్రాన్ని పాటించలేదని ఒప్పుకోరు. అసలు చీకటి వాస్తవం చెప్పుకోవాలంటే ఫాన్స్ కూడా పవన్ కి దెబ్బ వేశారు, కాపులు కూడా పోటు పొడిచారన్న అసలు నిజాన్ని గ్రహించరు. అందుకే పవన్ కి 100 రోజుల ముందు పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేసుకుని, 100 మిలియన్ల ట్వీట్లు వచ్చినా అవి గెలుపునకు దోహదపడవు.

సామాజికవర్గానికి పరిమితం కాను అంటూనే…!

పవన్ కళ్యాణ్ ప్రధాన లోపం నిలకడలేమి. ఆయన మొదటి నుండి రాజకీయంగా చెప్పిన మాటలు, చేసే చేతలు దేనికీ సంబంధం ఉండదనేది పెద్ద విమర్శ. మరోవైపు ఆయన తాను ఒక సామజిక వర్గానికి పరిమితం కాను అంటూ చెప్తూండే వారు. నిజానికి పవన్ 2019 ఎన్నికల ప్రణాళికల్లో కాపు ఓట్లలో కనీసం 50 శాతం తనకు వస్తాయి అనుకున్నారు. అంటే మొత్తం మీద కనీసం 12 శాతం ఓట్లు.., ఫాన్స్ ద్వారా మరో 10 శాతం ఓట్లు… రాబట్టడంతో ఓవరాల్ గా 25 నుండి 30 శాతం ఓట్లు లెక్కేసుకున్నారు. కానీ ఫాన్స్ ఓట్లు వేయలేదు. కాపులు పూర్తిగా అండగా నిలబడలేదు. కాపుల్లో కేవలం 3 శాతం మాత్రమే వేశారు. అలా పవన్ నమ్ముకున్న వర్గాలన్నీ దెబ్బకొట్టాయి. ఇప్పుడు కూడా పవన్ ని ముంచుతున్నది ఎవరు..? రాజకీయంగా పవన్ ముందుకు రాకపోవడానికి కారణం ఎవరు…? పార్టీ నిర్మాణం లేకపోవడానికి కారణం ఎవరు..? అంటే పవన్ రాజకీయ అపరిపక్వత… ఫాన్స్ లో క్రమశిక్షణ లేమి.., కాపుల్లో నమ్మకం లేమి…! ఈ మూడు కలిసి వచ్చిన నాడు జనసేన, పవన్ ఎంతోకొంత సాధిస్తుంది. లేకపోతే ట్విట్టర్లో.., ట్వీట్లలో ప్రపంచ రికార్డులు తప్పితే.., అసెంబ్లీలో స్థానాలు దక్కే అవకాశాలు తక్కువేననేది విశ్లేషకుల అభిప్రాయం.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju