Nivetha Thomas: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్ నివేద థామస్ .. మొదటిలో అనేక అవకాశాలు అందుకుని ప్రస్తుతం కీలక క్యారెక్టర్లు కలిగిన పాత్రలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” సినిమాలో ముగ్గురు అమ్మాయిల లో ఒక ప్రధాన అమ్మాయిగా.. నివేద థామస్ చేసిన క్యారెక్టర్ సినిమాకి హైలెట్ అయ్యింది. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన గానీ పెద్దగా పేరు రాకుండా పోయింది.
పవన్ సినిమా కావటంతో క్రెడిట్ మొత్తం పవన్ కి దక్కింది. అతి తక్కువ రోజులు మాత్రమే థియేటర్లో సినిమా ఉండటం కూడా పెద్ద మైనస్. ఇదిలా ఉంటే తాజాగా నివేద థామస్ మరో సరికొత్త ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో నివేద థామస్ బంపర్ ఆఫర్ దక్కించుకోవడం జరిగిందట. ఈ సినిమాలో మహేష్ సరసన క్యారెక్టర్ త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు… వకీల్ సాబ్ సినిమాల్లో మాదిరిగానే ఈ క్యారెక్టర్ కి వెయిట్ ఉండేలా త్రివిక్రమ్… డిజైన్ చేయడం జరిగిందట.
Read More: Mahesh babu Trivikram Movie: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకి ఆసక్తికర టైటిల్..!?
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు పవన్ కళ్యాణ్ సినిమా తరువాత మహేష్ సినిమా లో నివేద థామస్ కి చాన్స్ దొరికింది లో వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. నాని నటించిన “నిన్ను కోరే” సినిమా లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ .. ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకోవటం జరిగింది. సినిమాల కంటే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్. దీంతో పవన్- మహేష్ సినిమాలలో అవకాశం రావటం పట్ల నివేద థామస్ ఫ్యాన్స్ కరోనా తర్వాత మా బ్యూటీకి కాలం కలిసి వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.