AP Latest news: ఏకంగా రూ. వందల కోట్లు..! ఆ మంత్రి అనుచరుడి భారీ స్కామ్..!?

AP Latest news: Highly Corruption by Minister Shade
Share

AP Latest news: రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు చెప్పేది మొదటిగా అవినీతి రహిత పాలన అందిస్తాం. అది సాధ్యమా? అంటే కష్టతమే అని చెప్పాల్సి ఉంటుంది. పాలకులు మారినా ప్రజా ప్రతినిధుల మనస్థత్వాలు మారవు. అధికారుల పని తీరు మారదు. పరిపాలనలో రాజకీయ పరమైన అవినీతి, అధికార యంత్రాంగ అవినీతి రెండు రకాలుగా ఉంటుంది. అధికార యంత్రాంగంలో అవినీతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కంట్రోల్ చేస్తుంటుంది. అది కూడా కింది స్థాయిలో మండల, జిల్లా స్థాయిలో జరుగుతున్న అవినీతిని ఏసీబీ కట్టడి చేస్తుంటుంది కానీ అంతకంటే పై స్థాయిలో జరిగే అవినీతిని ఏసీబీ కంట్లోల్ చేసే పరిస్థితి ఉండదు. రాజకీయ అవినీతిని నిర్మూలించడం ఎవరి సాధ్యం కాదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ రాజకీయ అవినీతి విచ్చలవిడిగా జరిగేది.. అంటే ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు చేసే అవినీతి జరిగింది, ఇప్పుడు వైసీపీ అధికారంలోనూ రాజకీయ అవినీతి అనేది పెచ్చుమీరింది, హద్దులు దాటుతుందని అనే అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఓ మంత్రి ముఖ్య అనుచరుడి అవినీతి బాగోతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన దాదాపు రూ. వంద నుండి రూ. 150 కోట్ల రూపాయల రూపాయల అవినీతి పాల్పడినట్లు ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా దృవీకరించినట్లు సమాచారం. ఇప్పుడు ఆ విషయంలో పార్టీ, ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని నేడో రేపో చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

AP Latest news: Highly Corruption by Minister Shade
AP Latest news: Highly Corruption by Minister Shade

AP Latest news: ఉభయ గోదావరి జిల్లాల నాయకుడు..!?

ఆయన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కీలక మంత్రి. ఆయన నియోజకవర్గంలో తక్కువగా అందుబాటులో ఉంటారు. ఆయనకు ప్రైవేటు అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఈ తతంగం మొత్తం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చేపల చెరువుల టెండర్లు, ప్రైవేటు ఆసుపత్రులు, భవనాల నిర్మాణం, పోస్టింగ్ లు తదితర విషయాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని మంత్రికి తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ఉన్నట్లు సమాచారం. తనకు తెలియకుండా జరిగిన అవినీతి బాగోతంపై సదరు మంత్రి కూడా స్వయంగా అనుచరుడిని పిలిచి మందలించినప్పటికీ అవినీతి బాగోతం ఆగలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం చివరకు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మంత్రి అనుచరుడి అవినీతి బాగోతంపై జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయి నాయకులతో విచారణ జరిపి ఓ నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక అధారంగా ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే జాతీయ స్వచ్చంద సంస్థ (రెడ్ క్రాస్) కు సంబంధించి పోస్టింగ్ లలోనూ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ జరపగా అవినీతి రూఢీ అయ్యిందట. ఇది కూడా మంత్రి గారి అనుచరుడి లీలే అని తేలింది. ఈ విషయం అంతా సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో సదరు మంత్రిని పిలిచి మందలించారనీ, ఆ అనుచరుడిని దూరం పెట్టాలని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి సదరు అనుచరుడినికి పిలిచి నియోజకవర్గానికి దూరంగా ఉండాలనీ, ఏ విషయంలో కల్పించుకోవద్దని హెచ్చరించినప్పటికీ 15 రోజులుగా జరిగాల్సిన పనులు జరిగిపోతూనే ఉన్నాయట.

AP Latest news: Highly Corruption by Minister Shade
AP Latest news: Highly Corruption by Minister Shade

సేమ్ టీడీపీ లో జరిగినట్టే..!?

రాజకీయ అవినీతికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయ అవినీతిని నిర్మూలించడం అసాధ్యం. టీడీపీ హయాంలోనూ రాజకీయ అవినీతి జరిగింది కానీ వారి హయాంలో కాంట్రాక్ట్ లు, సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం లాంటివి వాటిలో జరిగాయనేది ప్రచారంలో ఉంది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అవినీతి కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ పనుల్లో వసూళ్లు, పోస్టింగ్ ల కోసం వసూళ్లు, బదిలీల కోసం వసూళ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లు చేయడంతో పాటు ఈ మంత్రి గారి అనుచరుడు ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రుల నుండి నెలవారిగా దాదాపు రూ. 30 కోట్ల వరకూ వసూళ్లు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఏపీలో రాజకీయ అవినీతి కొత్త కాదు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు దీనికి బీజం వేశారు. సీఎంగా ఎన్టీఆర్ కి కూడా తెలియకుండా నేక ఫైళ్లు కదిపేవారు.., అనేక బదిలీలు చేసేసేవారు. అలా మొదలైన రాజకీయ అవినీతి టీడీపీ, వైసీపీ తేడా లేకుండా హెచ్చరిల్లుతోంది. అవినీతి రహిత పాలనే ధ్యేయం అంటూ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ మంత్రి అనుచరుడి అవినీతి బాగోతంపై ఏ విధంగా స్పందిస్తారు. బాధితులకు ఎలా న్యాయం చేస్తారు. మంత్రిపైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.


Share

Related posts

మార్క్సిస్టులు కూడా ఆ తాను ముక్కలే!

Siva Prasad

సీఎం సీట్లోకి ప్ర‌మోష‌న్‌ …. ఆల్రెడీ పార్టీ నేత‌ల‌కు కేటీఆర్ వార్నింగ్ ?

sridhar

MK Stalin: నాడు మహిళా జర్నలిస్టుపై రేప్ – నేరారోపణలు..? నేడు ఉత్తమ సీఎం..! మార్పు నిజమా? నటనా..!?

Srinivas Manem