NewsOrbit
5th ఎస్టేట్

పరీక్ష పెరిగే… ఫలితం పెరిగే…!

 

ఏపీలో ఈ మధ్య కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవును నిజమే…!
తెలంగాణ లో ఈ మధ్య కరోనా కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అవును. నిజమే…!

ఏపీలో కరోనా కేసుల నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలమయింది. అందుకే పెరిగాయి. అది నిజం కాకపోవచ్చు.
తెలంగాణాలో కరోనా నియంత్రణలో సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేసారు. అందుకే తగ్గిపోతున్నాయి. ఇదీ అసలు నిజం కాకపోవచ్చు…!
ఇదండీ సంగతి. ఏపీలో కేసుల పెరుగుదలకు జగన్ అసమర్ధత కారణం కాదు, తెలంగాణాలో పెరుగుదలకు కేసీఆర్ సమర్ధత అసలు కారణం కానేకాదు. అవన్నీ లెక్కలు, మాయలు, చిక్కులు.

మరి నిజాలు…ఇవిగో లెక్కలు…!

ఏపీలో ఎప్పటి నుండి పెరుగుతున్నాయి? గడిచిన వారం రోజుల నుండి. అంటే ఏప్రిల్ 20 నాటికి ఏపీలో 722 .., తెలంగాణాలో 872 కేసులున్నాయి. కానీ ఏప్రిల్ 29 నరికి ఏపీలో 1332 కేసులుంటే… తెలంగాణాలో 1009 కేసులే ఉన్నాయి. అంటే తొమ్మిది రోజుల్లో ఏపీలో 610 కేసులు పెరిగితే, తెలంగాణాలో 137 మాత్రమే పెరిగాయి. ఇది ఒకే మరి కరోనాని నిర్ధారించేది, కరోనాని తేల్చేది ఆ వైరస్ పరీక్ష. ఏపీలో ఈ తొమ్మిది రోజుల వ్యవధిలో 51 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా, తెలంగాణాలో మాత్రం 4 వేల మందికి మాత్రమే చేశారు. అందుకే ఇక్కడ పెరుగుతున్నాయి, అక్కడ తగ్గుతున్నాయి. కానీ తెలంగాణాలో తెలియని మాయ జరుగుతున్నట్టు ఆరోపణలు మాత్రం చుట్టుకొస్తున్నాయి.

కేసీఆర్ కి తిరోగమనం…!

కరోనా నియంత్రణలో బాగా పని చేస్తున్నారని పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఓ పెద్ద అపవాదు ఎదుర్కొంటున్నారు. పది రోజుల కిందట వరకు కరోనా పరీక్షలు, ప్రెస్ మీట్లు, లాక్ డౌన్ అంటూ వరుస మాటలతో అదరగోట్టిన కేసీఆర్ ఇప్పుడు నెమ్మదించారు. వారం నుండి కనిపించడం లేదు. అక్కడ పరీక్షలు జరగడం లేదు, కేసులు బయట పడడం లేదు. రోజుకి సగటున 150 పరీక్షలు చేసుకుంటున్నారు. ఇదేంటి అని అడిగితే రాష్ట్రంలో కరోనా లేదు, టెస్టులు అవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. మొదట బాగా డీల్ చేశారనుకున్నా కేసీఆర్, ఇప్పుడు డీలా పడ్డారు. నాడు విమర్శించడానికి పాయింట్లు వెతుక్కుంటున్న ప్రతిపక్ష న్మాయకులు ఇప్పుడు లెక్కలను బయటకు తీసి, పరీక్షలు చేయడం లేదు అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే తిరోగమనం అంటే.

author avatar
Srinivas Manem

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment