NewsOrbit
5th ఎస్టేట్

రామోజీ అతి తెలివి…!

ramoji rao eenadu lay off but internal more issues

ఉద్యోగాల నుంచి పీకము..! జీతాలు తగ్గించము..! మీకు ఎటువంటి హనీ తల పెట్టము., మీ ఉద్యోగం భద్రమే.. కానీ సగం రోజులే పని చేయాలి, సగం జీవితమే తీసుకోవాలి. కానీ నెలలో అన్ని రోజులు అందుబాటులో ఉండాలి. ఇదే తెలుగునాట మీడియా మొఘల్ రామోజీ తెలివి. వారి మానస పుత్రిక “ఈనాడు”లో ఉద్యోగులకు ఎదురైన తాజా పరిస్థితి ఇది. దీనిలో కష్టనష్టాలు షరతులు అనేకం ఉన్నాయి.

పరోక్షంగా భారీ కోత…!

కరోనా వచ్చినప్పటి నుంచి పత్రికలన్నీ నష్టాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 పత్రికల్లో ఉద్యోగుల తీసివేత, జీతాలు కోత జరుగుతూనే వస్తోంది. దేశంలో బాగా పేరున్న దైనిక్ భాస్కర్.., దైనిక్ జాగరణ్ .., హిందూ.., వంటి పత్రికలు కూడా ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించాయి. కానీ ఈనాడు మాత్రం తమ ఉద్యోగులకు వెరైటీ కండిషన్ పెట్టింది. ఎక్కడ లీగల్ గా దొరకకుండా.., న్యాయపరంగా చిక్కులు ఎదురవకుండా.., నిబంధనలు తీసుకువచ్చి అమలు చేస్తోంది. వాటి ప్రకారం డెస్కులలో సబ్ ఎడిటర్లు నెలలో పదిహేను రోజులు మాత్రమే పని చేయాలి. ఆ పదిహేను రోజులకు పూర్తిస్థాయి వేతనం అందుతుంది. మిగిలిన 15 రోజులకు బేసిక్ మాత్రమే వస్తుంది. అంటే 50000 జీతం ఉండే ఓ సబ్ ఎడిటర్ కు ఈ నిబంధన మూలంగా 30000 జీతం అందుతుంది. అంటే 40 శాతం కోత అన్నమాట. మిగిలిన 15 రోజులు ఎక్కడైనా పార్ట్ టైం చేయొచ్చు అంటే అది వీలు పడదు. అది సంస్థ నిబంధనలకు విరుద్ధం. సో… ప్రస్తుతానికి ఈనాడులో ఉద్యోగుల పరిస్థితి ” మింగలేక కక్కలేక” అన్నట్లు ఉంది. ఆ సంస్థ యాజమాన్యం పరిస్థితి “పొమ్మన లేక పొగ” పెడుతుంది.

వాళ్ళలా ఉండకూడదని…!!

తెలుగులో ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ… వంటి అనేక పత్రికలు జీతాలను నేరుగా కత్తిరించాయి. దేశవ్యాప్తంగా కూడా మనం చెప్పుకున్నట్టు చాలా పత్రికలు అలాగే చేసాయి. అంతా బాగుంటే మళ్ళీ పెంచుతామని చెప్పాయి. కానీ ఇక్కడ ఈనాడు ఇచ్చిన వెరైటీ కోతకు చాలా అర్థం ఉంది. పత్రిక నెంబర్ వన్ పొజిషన్ దెబ్బ పడుతుండడం. యాడ్లు ఆదాయం.., సర్క్యులేషన్ లేక ఈనాడు తంటాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతోంది. తమ సామాజికవర్గం కాని వారికి కొందరికి చుక్కలు చూపిస్తుంది. “కాగల కార్యం కరోనా నెరవేర్చింది” అన్నట్టు ఈనాడు కి కాలం కలిసి వచ్చి ఉద్యోగుల నెత్తిన బాంబు వేసింది.

చిక్కులు రాకుండా జాగ్రత్తగా…!

ఇక దిగువ స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఐతే మ్మరీ దారుణం. మండల, గ్రామ స్థాయిలో రిపోర్టర్, యాడ్ ఎగ్జిక్యూటివ్, సర్క్యులేషన్ స్టాఫ్ దాదాపు 6 వేల మంది ఉంటారు. వారిలో చాలా మందిని పక్కన పెట్టేసింది. రిపోర్టర్లకు వార్తలు సరిగా జిల్లా ఎడిషన్ లేక.., 90% ఆదాయం తగ్గింది. యాడ్లు స్టాప్ కి, సర్క్యులేషన్ సిబ్బందిని దాదాపు 2200 మందిని సంస్థ పూర్తిగా పక్కన పెట్టింది .45 ఏళ్ల చరిత్ర ఉన్న ఈనాడు… 44 ఏళ్ల లాభాలను చూసి, అనుభవించి.., ఒక్క ఏడాది కష్టం, నష్టం వస్తే… న్యాయ పరంగా ఎక్కడా దొరకకుండా ఉద్యోగుల నెత్తిన భారం వేసేసింది. ఇదే మరి అతి తెలివి అంటే.

 

 

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau