Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “సలార్” రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే “సలార్” సినిమాకి సంబంధించి రెండు ట్రైలర్లు విడుదల చేశారు. రెండిటిలో కూడా ఫుల్ వైలెన్స్ ఉన్నట్లు చూపించడం జరిగింది. విడుదలకు మరికొద్ది గంటలు మాత్రమే టైమున్న సమయంలో తాజాగా ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. “ప్రతికథలో” అంటూ విడుదలైన ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది.
నటి ఈశ్వరి రావ్ కి సంబంధించిన పాటగా తెలుస్తోంది. ఆమె టీచర్ గా నటిస్తున్నట్లు పాట బట్టి అర్థమవుతుంది. ఈ సినిమాలో శృతిహాసన్, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించడం జరిగింది. ఈ ఇద్దరు స్నేహితులు చివరాఖరికి బద్ధ శత్రువులు అవుతారని.. అదే ఈ సినిమా కథ అని.. ట్రైలర్ లో మేకర్స్ తెలియజేశారు. 2018వ సంవత్సరంలో ప్రభాస్ “బాహుబలి” సినిమాతో చరిత్రత్మకమైన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో “సలార్” పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మొదటి భాగం సెప్టెంబర్ నెలలోనే విడుదల కావాల్సింది.
కానీ ఆ సమయంలో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 22కి వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా ఫలితం పై అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ “KGF” సినిమాలతో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. అటువంటి దర్శకుడు దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్ కలిగిన ప్రభాస్ తో సినిమా చేయటంతో “సలార్” సినిమా చూడటానికి సినీ ప్రేమికులు ఎంతో ఆశగా ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి టికెట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. కచ్చితంగా ఓపెనింగ్స్ లో “సలార్” అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వస్తే మిగతా రికార్డులన్నీ కూడా.. బద్దలు కొడుతుందని అభిమానుల అంచనా వేస్తున్నారు. మరి “సలార్” సినిమా ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాలి.