Salaar: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో “KGF” సినిమాలతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. “KGF” రెండు భాగాలు రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. “KGF 2” ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో “సలార్” సినిమా చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. “సలార్” కూడా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. మొదటి భాగం డిసెంబర్ 22వ తారీకు రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్లోగా జరుగుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ మరియు ఓ సాంగ్ విడుదల కావడం జరిగింది. “సలార్” ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఇంకా సినిమా రిలీజ్ కి వారం రోజులు కూడా టైం లేకపోవడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలియజేశారు.
తన 21 ఏళ్ల సినిమా కెరియర్ మొత్తంలో బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని అన్నారు. ప్రశాంత్ తో సినిమా చాలా ప్రశాంతంగా ఉంటుందని…సెట్స్ కి వచ్చిన నటీనటులను ఇబ్బందులకు గురి చేయడని అన్నారు. దీంతో ప్రశాంత్ నీల్ షూట్ ఉందని పిలిచినప్పుడు చాలా ఆసక్తిగా ఉంటుందని… అతనితో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ.. మంచి వాతావరణంలో షూటింగ్ ఉంటుందని తెలిపారు. తన 21 ఏళ్ల సినీ జీవితంలో… సినిమా నటించడానికి వెళ్తున్నానా లేక ఆస్వాదించడానికి వెళ్తున్నానా అని “సలార్” సినిమా సెట్స్ కి వెళ్తున్నప్పుడు.. ఫీలింగ్ ఏర్పడింది. సినిమా షూటింగ్ ప్రారంభమైన తొలి దినాలలోనే నాకు అలాంటి ఫీలింగ్ కలిగించేలా సెట్స్ లో ప్రశాంత్ నీల్ వాతావరణం సృష్టించారు. గత ఆరు నెలలుగా నా వేదన కూడా ఇదే. “సలార్” లో నటిస్తున్నానా లేకపోతే ఆస్వాదిస్తున్నానా ..? అనే ఫీలింగ్ తో ఉన్నాను. దీంతో ప్రశాంత్ నీల్ కేవలం ఒక్క నెలలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. నటులను అర్థం చేసుకోవడంలో ప్రశాంత్ తర్వాతే ఎవరైనా.
ఇదే సమయంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అయితే నా క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంచెం కండలు ఉండాలని చెప్పడంతో… కొద్దిగా వర్కౌట్ చేయడం జరిగింది. కండలు పెంచడం అనేది నాకు కొత్తేమీ కాదు. దీంతో నాకు పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. ఏ సినిమాకి తగ్గట్టు ఆ రకంగా తయారవడం నాకు అలవాటే. గత రెండు దశాబ్దాలుగా నా సినిమాల కోసం ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాను.. అంటూ ప్రభాస్ “సలార్” మొదటి భాగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే అనుకున్నంత రీతిలో ప్రమోషన్స్… జరగటం లేదు అని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇలా అయితే… ఓపెనింగ్స్ కలెక్షన్స్ డల్ అవుతాయని అంటున్నారు. మరోపక్క ప్రభాస్ కి సంబంధించిన మరో ట్రైలర్ విడుదల చేయడానికి “సలార్” సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది.