Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఐదు భాషలలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో నిఖిల్ పొద్దు పొద్దున్నే సినిమా టాక్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “ఇప్పుడే సినిమా చూసా..మాన్ స్టార్.. బ్లాక్ బస్టర్.. ప్రభాస్ నీ స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు… గుస్ బంప్స్ వచ్చాయి. యంగ్ రెబల్ స్టార్ అద్భుతం విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా యూనిట్ కి అభినందనలు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పోస్ట్ పెట్టడం జరిగింది. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 5 సంవత్సరాల తర్వాత.. ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సినిమా కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుందని.. బెనిఫిట్ షోలు పాల్పడిన తర్వాత ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాలో బాడీ చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాన్ సార్ ఎరుపెక్కిందని చెప్పుకొస్తున్నారు. బాక్సాఫీస్ మీద ప్రభాస్ కన్నెర్ర చేశాడని ఇక రికార్డులు.. బద్దలవటం గ్యారెంటీ అని.. ఐదు సంవత్సరాల తర్వాత హిట్ కొట్టేసామంటూ ప్రభాస్ ఫ్యాన్స్.. కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో… యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ప్రభాస్ నీ ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా సినిమాలో చూపించారని చెప్పుకొస్తున్నారు.
“బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు భారీ రేంజ్ లో విడుదలయ్యాయి. కానీ మూడు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కోసం ప్రభాస్ చాలా టైం కేటాయించారు. కానీ ఫలితం మాత్రం మొదటి షో పడిన తర్వాతే నెగిటివ్ రావటం ఫ్యాన్స్ కి నిరుత్సాహం కలిగించింది. “సలార్” కూడా ఆ రకంగానే ఉంటుందని మొదట భావించారు. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగలేదు. ఈ పరిస్థితులలో సినిమా విడుదలయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.