ఆగస్టు మొదటి వారంలో విడుదలైన `బింబిసార`, `సీతారమం` చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే విడుదలై ఇరవై రోజులు గడిచినా బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తొలి సోసియో ఫాంటసీ మూవీ `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 5న అట్టహాసంగా రిలీజ్ ఈ చిత్రానికి తొలి షో నుండే పాజిటివ్ రివ్యూలు రావడంతో.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టిస్తోంది.
20వ రోజు కూడా వరల్డ్ వైడ్ గా రూ. 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న అదరగొట్టేసింది. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఇరవై రోజులు గడిచే సరికి రూ. 36.50 కోట్ల షేర్, రూ. 62.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 20.30 కోట్ల ప్రాఫిట్స్‌తో దూసుకెళ్లోంది.
ఇక `సీతారామం` విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక కీలక పాత్రను పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఆగస్టు 5న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. 20వ రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ములేపింది. రూ. 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఇరవై రోజులు గడిచే సరికి రూ. 34.53కోట్ల షేర్, రూ. 69.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 17.53 కోట్ల ప్రాఫిట్స్‌తో ముందుకు సాగుతోంది.