22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Entertainment News సినిమా

ఆక‌ట్టుకుంటున్న `ధమాకా` రొమాంటిక్ గ్లింప్స్.. ర‌వితేజ ఈసారి హిట్ కొడ‌తాడా?

Share

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయిన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ `క్రాక్‌`తో స‌క్సెస్ ఎక్కాడు. అదే జ్యోష్‌లో వ‌రుస పెట్టి సినిమాలు చేశారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చిన చిత్రాలే `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

దాంతో మ‌ళ్లీ ఫ్లాపుల్లో మునిగిపోయిన ర‌వితేజ‌.. త్వ‌ర‌లోనే `ధ‌మాకా`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. అయితే నేడు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా.. ఈ మూవీని నుంచి మేక‌ర్స్ ఓ రొమాంటిక్ గ్లింప్స్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇందులో కళ్లతో సైగలు చేస్తూ హీరోయిన్ శ్రీ‌లీల‌ను పక్కకు పిలుస్తుంటారు రవితేజ.

ఈ విడియో గ్లింప్స్ నిజంగానే రొమాంటిక్ అండ్ ప్ల‌జెంట్‌గా ఉండటంతో సినీ ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. మ‌రి ఈ సినిమాతో అయినా ర‌వితేజ హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..లేదా.. అన్న‌ది చూడాలి.


Share

Related posts

బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై దాడి చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Vihari

Superstar Krishna: ఆ కోరికలు తీరకుండానే కృష్ణ లోకాన్ని విడిచారు..!!

sekhar

Bheemla Naayak: సారీ చెప్పిన “బీమ్లా నాయక్”.. ప్రొడ్యూసర్..!!

sekhar