NewsOrbit
Entertainment News సినిమా

పెళ్లిపై వార్త‌లు.. అమ్మ‌ ఆ మాటన‌గానే రామ్‌కి దిమ్మ‌తిరిగింద‌ట‌!

Share

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడ‌ని, త‌న స్కూల్ ఫ్రెండ్‌నే ఆయ‌న‌ ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడ‌ని మొన్నాధ్య జోరుగా వార్త‌లు వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను రామ్ అప్పుడే ఖండించారు. అయితే తాజాగా మ‌రోసారి ఆ వార్త‌ల‌పై స్పందించాడు. `ది వారియ‌ర్‌` ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రామ్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా పెళ్లిపై మాట్లాడుతూ.. `సాధారణంగా నా పెళ్లిపై వ‌చ్చే వార్త‌ల‌ను ప‌ట్టించుకోను. హీరో అన్నాక ఇలాంటి పుకార్లు రావడం కామన్‌లే అని ఇంట్లో వాళ్లు కూడా లైట్‌ తీసుకునే వాళ్లు. కానీ ఈ సారి మాత్రం సీక్రెట్‌ చైల్డ్‌వుడ్‌ ఫ్రెండ్‌తో పెళ్లి అనేసరికి ఇంట్లో వాళ్లు, స‌న్నిహితులు, ఫ్రెండ్స్ అంద‌రూ అనుమానంగా చూడడం మొదలు పెట్టారు.

రామ్‌ని అలా ఎందుకంటారో నాకు ఇప్పుడు తెలిసిందంటూ.. కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.

మా అమ్మ అయితే ఏకంగా “ఏం లేకుండానే ఇలా రాస్తారంటావా?“ అని అన‌గానే నాకు దిమ్మ‌తిరిగింది. నేను స్కూల్‌కే రెగ్యూలర్‌గా వెళ్లలేదు. ఇక అమ్మాయితో ప్రేమలో ఎలా పడతానని వివ‌రించాకే అమ్మ రియలైజ్‌ అయ్యింది. అందుకే పెళ్లి వార్త‌ల‌కు చెక్ పెడుతూ వెంట‌నే ట్వీట్ చేశాను.` అంటూ చెప్పుకొచ్చారు.

ఇక తాను పెళ్లి చేసుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ఉందని, ప్ర‌స్తుతం తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉంద‌ని రామ్ వెల్ల‌డించాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక `ది వారియ‌ర్‌` విష‌యానికి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. జూలై 14న ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.


Share

Related posts

NBK 105 టైటిల్‌, రిలీజ్ డేట్ ఖ‌రారు

Siva Prasad

Ennenno Janmala Bandham: నెక్స్ట్ లెవెల్లో యష్ వేదస్విని రొమాన్స్…వేదస్విని గురించి మంచి వార్త మాలినితో పంచుకున్న సులోచన!

Deepak Rajula

ఓటిటి లపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..!!

sekhar