Alpha Review In OTT: ప్రస్తుత కాలంలో సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లలో అనేక సినిమాలు వస్తున్నాయి. కానీ ఒక మనిషి, ఒక తోడేలు కలిసి ప్రాణాల కోసం పోరాటం చేసే సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి. అలాంటి వాటిలో ఆల్పా మూవీ కూడా ఒకటి. ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ లో కోడి స్మిత్ మెక్ఫీ, జోహాన్నెస్ హౌకుర్ జోహాన్నెసన్ , నటాసియా తదితరులు కీలకపాత్రను పోషించారు. ఈ మూవీకి ఆల్బర్ట్ దర్శకత్వం వహించాడు. 51 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 99 బిలియన్స్ కు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతూ తన సత్తా చాటుకుంటుంది. 2000 సంవత్సరాల క్రితం ఒక గిరిజన తెగ ఉండేది. వారి నాయకుడు టా ( జోహన్నెస్ హౌకుర్ జోహాన్నెసన్) వారు జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. శీతాకాలానికి సరిపడే మాంసం కోసం వేట కోసం వెళ్తారు. గిరిజన తెగ నాయకుడు టా బృందంతో పాటు అతని కుమారుడు కేడా ( కోడి స్మిత్ మెక్ఫీ) కూడా వేటకు వెళ్తాడు. కానీ.. ప్రమాదవశాత్తు ఓ లోయలో పడిపోతాడు. దాంతో తేడా చనిపోయాడు అనుకుని తెగ బృందం వెళ్లిపోతుంది. లోయలో పడిన కేడా బతికి ఎలా బయటపడ్డాడు? లోయలో నుంచి పైకి ఎలా వచ్చాడు? తన వాళ్లు ఉన్న ప్రపంచానికి ఎలా చేరుకున్నాడు? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది.
ఇక ఆదిమానవులు జంతువులను వేటాడి వాటి మాంసాన్ని నిప్పులపై కాల్చుకుని వండుకుని తినేవారని తెలిసింది. కానీ అనంతరం వాటిని వేటాడడమే కాకుండా వాటిలో కొన్ని జంతువులను మచ్చుక చేసుకుని, జీవనానికి ఉపయోగించుకుంటారు. మనిషి, జంతువు మనుగడకు ఎలా ఒక్కటి అయ్యాయో సర్వైవల్ థ్రిల్లర్ అంశాలతో చూపించిన సినిమానే ఆల్పా. ప్రస్తుత కాలంలో ఈ జోనల్లో అనేక సినిమాలు వస్తున్నప్పటికీ ఇటువంటి కథాంశంతో ఎటువంటి సినిమాలు రాలేదు. కనుక ఈ సినిమాని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కొత్త కథ మరియు యాక్ట్రెస్ యాక్టింగ్ బాగుంటే ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారు.
ఇక ఒక తొండ కి మరియు గిరిజన వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ మూవీలో స్పష్టంగా చూపించారు. మొత్తానికి అయితే ప్రేక్షకుల ఆదరణ పొందారు. గిరిజనుల ఆకలిని మరియు వారు వేటాడే తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. దీంతో అతి తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ మూవీ. అంతేకాకుండా టాప్ 10 లో నిలిచింది. ఇక్కడ రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ సీక్వెల్ ని కూడా రూపొందించేందుకు మగ్గుచూపుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ ని రూపొందిస్తున్నారు.
ఆల్పా మూవీ రేటింగ్: 4.6