RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు కావస్తోంది. 2022 మార్చి నెలలో “RRR” రిలీజ్ కావటం జరిగింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా మొదలుపెట్టడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఏడాదిన్నర నుండి జరుగుతున్న ఇంకా కంప్లీట్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దర్శకుడు శంకర్ మధ్యలో కమలహాసన్ “ఇండియన్ 2” సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా..ఇప్పుడు “గేమ్ చేంజర్” షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు హైదరాబాదులో పలు కీలకమైన యాక్షన్ సన్నివేశాలలో చరణ్ పాల్గొన్నారు.
ఇక ఇదే సమయంలో బుచ్చిబాబు సినిమా షూటింగ్ కూడా చరణ్ లైన్ లో పెట్టడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యాసతో కూడిన సబ్జెక్టు మీద కథ ఆధారపడినట్లు ఇటీవల దర్శకుడు తెలియజేయడం జరిగింది. దీంతో సినిమాలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన స్థానిక ప్రజలకు సినిమాలో నటించడానికి అవకాశం కల్పిస్తూ ఆడిషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్. ఏఆర్ రహమాన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఇప్పటికే రెండు సాంగ్స్ కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ లుక్ మొత్తం మార్చుకోవడం జరిగింది. షార్ట్ హెయిర్ లో సైడ్స్ తగ్గించి ఫ్రంట్ పైన కొద్దిగా ఎక్కువ ఉంచుతూ ఛార్మింగ్ లుక్ లో మేకోవర్ పూర్తిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ రామ్ చరణ్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ అన్నట్లు సమాచారం.