Rana Naidu: 2023 ఏడాది రెండు వారాలలో.. ముగియనుంది. సినిమా ఇండస్ట్రీ పరంగా ఈ ఏడాది మంచి ఫలితాలే వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొంత కాలం నుండి ఆశించిన రీతిలో సత్తా చాట లేకపోయినా బాలీవుడ్.. ఈ ఏడాది పుంజుకుంది. షారుక్ ఖాన్ రెండు సినిమాలు జవాన్, పఠాన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు పడ్డాయి. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. ఇక రీసెంట్ గా రణబీర్ కపూర్ “యానిమల్” సినిమాతో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్లు క్లబ్ లో జాయిన్ కానున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక ఇదే సమయంలో వెబ్ సిరీస్ లు కూడా సత్తా చాటడం జరిగాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లో విడుదలైన “రానా నాయుడు” వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. అయితే బూతు కంటెంట్ ఎక్కువగా ఉందన్న విమర్శలు వచ్చినా గాని.. అత్యధిక వ్యూయర్షిప్.. అందుకోవటం జరిగింది. అప్పటివరకు ఫ్యామిలీ ఇమేజ్ హీరోగా ఉన్న వెంకటేష్.. ఈ వెబ్ సిరీస్ లో నాగ నాయుడు పాత్రలో రెగ్యులర్ నటనకు భిన్నంగా నట విశ్వరూపం చూపించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినా ఈ వెబ్ సిరీస్ 2023 జనవరి నుంచి జూన్ వరకు అంటే మొదటి ఆరు నెలలలో అత్యధిక వ్యూయర్షిప్ షోలలో “రానా నాయుడు” చోటు సంపాదించుకుంది. ఇండియా నుంచి ఇదొక్క సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూయర్షిప్ అందుకున్న షోగా నిలిచింది. మొత్తం 400 టాప్ మోస్ట్ సిరీస్ లు ఈ ఏడాది అత్యధిక వ్యూయర్షిప్… అందుకున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ లిస్ట్ విడుదల చేసింది.
ఈ లిస్టులో ఇండియా నుండి ఒక్క “రానా నాయుడు” సీరిస్ మాత్రమే చోటు సంపాదించుకోవడం విశేషం. అయితే ఈ లిస్టులో అమెరికా షో “ది నైట్ ఏజెంట్” మొదటి స్థానం దక్కించుకుంది. ఏకంగా 81.21 కోట్ల గంటల వ్యూయింగ్ నమోదు కావడం జరిగింది. రెండో స్థానంలో ” గిన్ని అండ్ జార్జియా సీజన్ 2″ నిలిచింది. ఈ రకంగా “రానా నాయుడు” 400 టాప్ మోస్ట్ సీరిస్ లో 336వ స్థానంలో నిలిచింది. “రానా నాయుడు” వెబ్ సిరీస్ కి 1.16 కోట్ల వ్యూయింగ్ గంటలు నమోదు అయ్యాయి. ఎన్నో విమర్శలు ఈ వెబ్ సిరీస్ కి రాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో చోటు దక్కించుకోవడం విశేషం.