Daggubati Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద కుటుంబాలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. మూవీ మొగల్ దివంగత రామానాయుడు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ఆయన ఎన్నో విజయాలు అందుకున్నారు. అదే ఫ్యామిలీ నుండి టాప్ మోస్ట్ నిర్మాతగా సురేష్ టాప్ హీరోగా వెంకటేష్… విజయవంతంగా రాణించటం జరిగింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా కూడా… హీరోగా దక్షిణాదిలో ఉత్తరాదిలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఇటీవల.. తేజ దర్శకత్వంలో “అహింస” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మొదటి సినిమా తర్వాత రెండో సినిమా ప్రయత్నాలు జరుగుతుండగా అభిరామ్ పెళ్లి నీ కుటుంబ సభ్యులు చాలా సైలెంట్ గా చేసేసారు. శ్రీలంకలో డిసెంబర్ మొదటి వారంలో ఓ రిసార్ట్ లో కేవలం కుటుంబ సభ్యులకు కొద్దిమంది అతిధుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. దగ్గుబాటి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఒక్క ఫోటో తప్ప బయటకు ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. వివాహ వేడుక అనంతరం శ్రీలంక నుండి హైదరాబాద్ లో దగ్గుబాటి ఫ్యామిలీ ప్రత్యక్షం కాగా ఆ విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కానీ రీసెంట్ గా దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో బయటకొచ్చింది. ఈ ఫోటోలో ఒకే ఫ్రేమ్ లో హీరో నాగచైతన్య, దగ్గుబాటి రానాతో పాటు ఆయన భార్య అదేవిధంగా వెంకటేష్ మరియు ఆయన భార్య పిల్లలు సురేష్ బాబు మరియు ఆయన భార్య..ఇలా కుటుంబ సభ్యులంతా ఫోటోలో ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే త్వరలో… నిర్మాత సురేష్ బాబు ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.