Allu Arjun: ఏప్రిల్ 8న నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే అని అందరికీ తెలుసు. దీంతో నిన్న అర్థరాత్రి నుంచే అభిమానుల హంగామా మొదలైంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి అల్లు అర్జున్ ఇంటి ముందు భారీగా ఫ్యాన్స్ చేరుకుని సందడి చేశారు. మిడ్ నైట్ అయినా కూడా అల్లు అర్జున్ బటయకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది. సెలబ్రిటీలు, నెటిజన్లు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు బుల్లితెరపై కూడా అల్లు అర్జున్ బర్త్‌డే హంగామా కనిపిస్తోంది. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను నేడు ప్రముఖ టీవీ ఛాన్సెల్ లో టెలికాస్ట్ చేస్తున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ తో పాటు నేడు మరికొందరు సెలబ్రిటీలు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారెవరో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని నేడు తన 30వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో నాగార్జున మరియు అమల దంపతులకు జన్మించిన అఖిల్.. సిసింద్రీ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు. అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఫస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్న అఖిల్.. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ధీర అనే మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు.
అలాగే నేడు బర్త్‌డే జరుపుకుంటున్న సెలబ్రిటీల్లో నిత్యా మీనన్ ఒకరు. ఈ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ 1988 ఏప్రిల్ 8న కర్ణాటకలో స్థిరపడిన మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది. మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ మరియు ఇంగ్లీషుతో సహా ఆరు భాషలు మాట్లాడగల నిత్యా మీనన్.. 1998లో హనుమాన్ అనే హాలీవుడ్ మూవీతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. గ్లామర్ షోకు తావు లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైంది. మంచి సింగర్ లోనూ పేరు తెచ్చుకుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తోంది. నేడు నిత్యా మీనన్ బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ కూడా ఈ రోజే జన్మించాడు. అకీరా నందన్ ఇంకా ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ హీరోల రేంజ్ లో అతను క్రేజ్ సంపాదించుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అయితే అకీరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అని కూడా పిలుస్తున్నారు. అకీరా నందన్ ఫిల్మ్ ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేడు పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అకిరా ఫోటోలు షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ విషెష్ తెలుపుతున్నారు. ఇక ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ బర్త్‌డే కూడా ఈ రోజే. ఎన్నో అద్భుతమైన పాటలను రచించిన అనంత శ్రీరామ్ కు కూడా నెట్టింట పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.