Paluke Bangaramayenaa April 8 2024 Episode 197: యశోద నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడుతున్నావ్ అభి శ్వర ఒకటిగా ఉండి ఆ వైజయంతిని అరెస్టు చేశారు వాళ్ళిద్దరూ కలిసి సాక్షాలు సేకరించారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటే అభి తప్పు చేయలేదని నిరూపించగలరు మనం భయపడడం మానేసి వాళ్ళిద్దరూ ఎలా కలపాలో ఆలోచించాలి ఆ తరువాత స్వర అభిని రక్షిస్తుంది అని బామ్మ అంటుంది. నిజమే అత్తయ్య ఇకమీదట నుంచి వాళ్ళిద్దర్నీ ఎలా కలపాలో ఆలోచిస్తాను వాళ్ళిద్దర్నీ మనమే ఒకటి చేయాలి లేకపోతే వాళ్ళిద్దరూ మనసులో దూరం పెరుగుతుంది అని యశోద అంటుంది. కట్ చేస్తే, ఏంటి బంగారం ఏం ఆలోచిస్తున్నావ్ అని రవీంద్ర అంటాడు. ఏముంది వైజయంతి కానుంచి డబ్బులు ఎలా లాగాలి అని ఆలోచిస్తున్నాను కానీ మా అన్నయ్య ని ఇరికించి తన భర్తను చంపేసింది మనం ఇంకేం ప్లాన్ చేద్దాం అని చందన అంటుంది.
బంగారం స్వరని అభిని దూరం చేసి మనం వైజయంతి కానుంచి డబ్బులు లాగవచ్చు అని రవీంద్ర అంటాడు.కీర్తిని ఆర్య ని అడ్డం పెట్టుకొని అయినా స్వర అన్నయ్యల మధ్య దూరాన్ని పెంచాలి అప్పుడే మనం అన్నయ్యని ఏదైనా చేయగలం అని చందన అంటుంది. కట్ చేస్తే, అభిషేక్ స్టేషన్ కి వెళ్తాడు. నీలకంఠ వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతాడు. నీలకంఠ నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా డిపార్ట్మెంట్ అంతా నేనే తప్పు చేశాను నమ్ముతున్నారు కదా అసలు ఇదంతా నా వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారు నీలకంఠ ఇదంతా ప్లాన్ చేస్తుంది ఆ విశాల్ వైజయంతి అనుకుంటా అని అభిషేక్ అంటాడు.లేదు సార్ నేను ఎంక్వైరీ చేశానువాళ్లు బెయిల్ రావడం కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు సార్ జైల్లోనే ఉన్నారు అని నీలకంఠం అంటాడు. లేదు నీలకంఠ ఎవరో నా వెనుక ఉండి ఇదంతా చేస్తున్నారు నేను చీకట్లో బాగా గమనించలేకపోయాను కానీ ఆర్య ని షూట్ చేయబోతుండగా నేను ఆ చీకట్లో వ్యక్తికి గన్ను గురి పెట్టాను
ఈ లోగా వాడు నాయుడు సార్ ని కాల్ చేసి వెళ్ళిపోయాడు కానీ మన డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నేనే కాల్ చేశానని నా మీద నింద వేశాడు వాడి మీద నాకు డౌట్ గా ఉంది ఎందుకైనా మంచిది వాడి మీద కన్నేసి ఉంచు వాడు ఎకౌంట్లోకి డబ్బులు పెద్ద మొత్తం ఏమో ఎంక్వయిరీ చెయ్ అని అభిషేక్ అంటాడు. సార్ రిపోర్టులు మీ గన్ లో నుంచి వచ్చిన బుల్లెట్ నెంబరే ఉందంట అని నీలకంఠ అని చెబుతాడు. కట్ చేస్తే, ఆర్య ఏం ఆలోచిస్తున్నావ్ అని స్వర అడుగుతుంది. ఏమీ లేదక్కా అభి సార్ నాన్నని కాల్చాడు అంటే నువ్వు నమ్ముతున్నావా అని ఆర్య అంటాడు. అసలు అక్కడ ఏం జరిగింది తమ్ముడు అని సరే అడుగుతుంది. ఆ పార్టీలో అందరూ డ్రింక్ చేస్తున్నట్టు అనిపించింది స్మోకింగ్ కూడా చేస్తున్నారు దానితో నాకు అక్కడ ఉండాలనిపించలేదు వెళ్దామనుకునేసరికి మా ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా కూల్డ్రింక్స్ తాగించారు అని జరిగిన విషయం అంతా చెబుతాడు ఆర్య. అక్క నీ మనసు ఏది చెప్తే అది కరెక్ట్ తొందరపడి
అభి సార్ ని నిందించకు అంటూ ఆర్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,చందన మీ అన్నయ్యకి స్వరకి దూరం పెంచాలి అంటే మనం ఏం ప్లాన్ చేద్దాం తను బట్టలు ఇస్తిరి చేస్తూ ఉండగా బట్టలు కాల్ చేసి స్వర ఇలా కోపంతో చేసిందని చెబుదామా అప్పుడు మీ అన్నయ్య స్వరని కోప్పడతాడు అని రవీంద్ర అంటాడు. ఇప్పుడున్న సిచువేషన్ లో మా అన్నయ్య స్వర తిట్టినా కొట్టినా ఏమీ అనడు ఇంకేదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు అని చందన అంటుంది. అయితే స్వర కాఫీ కలిపి ఇచ్చిందని మనమే అందులో విషయం కలిపి మీ అన్నయ్యకి ఇచ్చేద్దాం మీ అన్నయ్య చచ్చిపోతాడు అప్పుడు స్వరమీదికి కోపంతో ఇలా చేసిందని నెట్టేద్దాం అందర్నీ నమ్మిద్దాం అని రవీంద్ర అంటాడు. మీ ప్లాన్ బాగుంది వైజయంతికి మా అన్నయ్యను మనమే చంపేద్దామని ఎక్కువ మొత్తంలో డబ్బు అడుగుదాం అని చందన అంటుంది. కట్ చేస్తే, స్వర చెట్లకి నీళ్లు పడుతూ ఉంటుంది. ఇంతలో నీలకంఠం వచ్చి స్వరమా బాగున్నావా అని అడుగుతాడు.
బాగున్నాను అన్నయ్య మీరు బాగున్నారా అని స్వర అడుగుతుంది. చూడమ నేను ఇలా చెప్తున్నాను అని నువ్వు అపార్థం చేసుకోకు అభి సార్ తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా ఒకప్పుడు అభి సార్ తప్పు చేశాడని లోకమంతా నమ్మిన మీరు నమ్మలేదు ఒక అమ్మాయి అభి సార్ మీద నింద వేసిన సరే మీరు చివరి క్షణంలో వచ్చి సాక్షాలతో సహా అభి సర్ నిర్దోషత్వాన్ని బయటపెట్టారు అలాంటిది మీరు ఇప్పుడు ఆయనని అనుమానించడం ఏంటమ్మా అభి సార్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం మారకూడదు ఒకసారి బాగా ఆలోచించమ్మా అభి సార్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు అని నీలకంఠం వెళ్లిపోతాడు
కట్ చేస్తే, స్వర నీలకంఠ అని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అభిషేక్ వచ్చి కాఫీ తెచ్చి స్వర కాఫీ తాగుతావా అని అడుగుతాడు. తను కోపంగా చూసేసరికి వద్ద అంటూ తాగుతాడు కాఫీ. ఒకప్పుడు ఒక అమ్మాయి నాకు కాఫీ వేడిగా ఉన్నప్పుడే తాగాలని చెప్పింది వేడిగా ఉంది కాలుతుందనే సాస్ కూడా తెచ్చి ఉప్పు అని ఊదుకొని తాగమని చెప్పేది అప్పటి రోజులు వేరులే అప్పుడు మేము చాలా బాగుండే వాళ్ళం అని ఆకాశమంగా చూస్తాడు అభిషేక్. చూసావా స్వర కిటికీలోనుంచి ఆకాశాన్ని చూస్తే ఎర్రగా కనిపించింది అదే దగ్గరికి వచ్చి చూస్తే మబ్బుల చాటున ఉన్న సూర్యుడు ఎండ పడడం వల్ల ఎర్రగా ఉన్నాడని అర్థమవుతుంది కానీ ఆ మబ్బుల చాటున ఆకాశం నీలంగా ప్రశాంతంగా ఉంది ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి స్వర మనం ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎలా జరిగింది అని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అభిషేక్ అంటాడు. అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే స్వర అనుకుంటుంది.