NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ x నిమ్మగడ్డ..! ఆరాటం.., భయం మధ్య కొట్టుమిట్టాడుతున్న ముఖచిత్రాలు ఇవీ..!

వహ్వా..! చెప్పుకోవాలే గానీ ఏపీలో రాజకీయ చర్చలకు కొదవే ఉండదు. రాజధానులని, పోలవరమని, స్థానిక ఎన్నికలని.. ఇవేమి లేకపోతే టిడికో ఇళ్ళని పేదలకు ఇవ్వాలనో.., ఇళ్ల పట్టాలనో గొడవలు చేస్తూనే ఉంటారు. వీటి మధ్య నిమ్మగడ్డ నేనున్నానంటూ తెరపైకి వస్తూ ప్రభుత్వంతో కత్తులు దూస్తుంటారు. స్థానిక ఎన్నికల పరిణామాలు చర్చించే ముందు ఓ సారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎం జగన్ ఇలా ఇద్దరి లోపల నెలకొన్న ఆరాటం, భయం.. తలదన్నే వ్యూహం ఓ సారి చెప్పుకోవాల్సిందే..!

Nimmagadda Ramesh vs cm Jagan

నిమ్మగడ్డ ఏమనుకుంటున్నారంటే..!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్. గత ఏడాది మర్చి వరకు ఎవరికీ తెలియని పేరు. నాయకులూ, జనమూ, రాజకీయులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎన్నికలు ఉంటేనే ఆయనకు చేతి నిండా పని. లేకపోతే గోళ్లు గిల్లుకోవడమే. అందుకే గత ఏడాది గట్టిగా పని చేయాలి అనుకునే సమయానికి కరోనా వచ్చి పడింది. ఈ కరోనా సమయానికి ముందే వైసీపీ స్థానిక సమరంలో దున్నేస్తుంది. స్థానిక ఏకగ్రీవాలు పేరిట హవా చాటుతుంది. ఇక పిర్యాదులు, ఆరోపణలు, వివాదాలు, అంతకు మించిన సొంత అవకాశాలతో విసిగిపోయిన నిమ్మగడ్డకి కరోనా దొరికింది. ఇక ఎన్నికలు ఆపేసారు. దీంతో జగన్ కి కోపం వచ్చింది. ఎడాపెడా ఏకి పారేసి.., ఆర్డినెన్సు తెచ్చేసి నిమ్మగడ్డని తొలగించేసారు. కానీ చట్టం ముందు నిలబడలేదు. నిమ్మగడ్డ మళ్ళీ అదే కుర్చీలోకి వచ్చేసారు. ఇక మొదలెట్టారు తన రాజకీయం..!!

nimmagadda ramesh kumar

స్థానిక ఎన్నికలు నిర్వహిస్తేనే తన పగ..!!

ఏమో ఏమైనా అంటే రాజ్యాంగ వ్యవస్థలు.. మా పని మాది అంటారేమో..!! కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే… నిమ్మగడ్డ కూడా ఒక మనిషే. పైగా ఒక హోదా, స్థాయి ఉంది. ఆయనకు పగలు, ప్రతీకారాలు ఉంటాయి. భక్తులు, విశ్వాసాలు, ఆశీస్సులు కూడా ఉంటాయి. అందుకే సీఎం పవర్ చూపించి.., ప్రయోగించి.., తనను తొలగించిన జగన్ కి తాను ఏమిటో.., తన పవర్ ఏమిటో చూపించాలని ఉంటుంది కదా..!? అది జరగాలి అంటే స్థానిక ఎన్నికలు జరగాల్సిందే కదా..!? సో.., అక్కడ మొదలయింది వివాదం. స్థానిక ఎన్నికలు నిర్వహించి, తాను పని చేసుకుంటాను అని నిమ్మగడ్డ.., అసలు నీకు ఆ అవకాశం ఇవ్వను అంటూ సీఎం జగన్ రెండో దశ పోరుకి తెరతీశారు. ఏది ఏమైనా.., తాను హోదాలో ఉన్నప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.., తన పని పవర్ చూపించాలి అనేది నిమ్మగడ్డ ఆరాటం. దీనిలో కొన్ని భయాలున్నాయి. తనకు ఇంకో 6 నెలలు మాత్రమే సమయం ఉండడం. తాను బీజేపీ నేతలతో ఓ హోటల్ లో కలిసి దొరికిపోవడం.., రాజకీయాల్లో ఒక వర్గంతో కలిసి ఉన్నారనే అపవాదు మూటగట్టుకోవడంతో తాను ఎంతగా “చట్టం, రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ.., ఈయన వెనుక పార్టీ, నాయకుడు అనేది బయటకు తెలిసిపోతుంది” అదే నిమ్మగడ్డ భయం కూడా..!

ys jagan on nimmagadda issue

పట్టు పోతే మళ్ళీ దొరకదు..!

మరి సీఎం జగన్ కూడా ఓ ఆరాటం, భయం మధ్య ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కి స్థానిక ఎన్నికల అవకాశం ఇస్తే తనకు మాట పోతుంది. తన పార్టీకి ఇబ్బందులు తప్పవు. పాత గొడవలు, పాత ఆర్డినెన్సులు దృష్టిలో పెట్టుకుని నిమ్మగడ్డ ఇబ్బందులు పెడతారు. అందుకే ఆయన ఉండే వరకు స్థానిక ఎన్నికలు అవసరం లేదు అనేది జగన్ ఆరాటం. ఒకవేళ పెడితే తాము నష్టపోతాం అనేది భయం. అందుకే ఒక వ్యూహంతో వెళ్తున్నారు. నిమ్మగడ్డ కోర్టుల ద్వారా వస్తుంటే.., సీఎం జగన్ తన అధికారులు ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినా ఏం చేయాలో.., ఎలా చేయాలో జగన్ కి తెలుసు. సుప్రీమ్ లో అపీల్ వేయడం.., అది ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలు రంగంలోకి దిగుతాయ్. “మేము కరోనా విధుల్లో ఉన్నాం, స్థానిక ఎన్నికలకు సహకరించలేం అని పిటిషన్ వేస్తాయ్. ఇలా అయిదు నెలలు ఆపితే చాలు జగన్ గెలిచినట్టే. నిమ్మగడ్డ దిగినట్టే. అందుకే ఎవరి వ్యూహంతో వారు ఈ తెరని నడిపిస్తున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?