Corporate Bills: ఇది చూసారా..!? గుండె గుబిల్లు – పేదోడికి చిల్లు – ఈ పాపం పాలకులకే చెల్లు..!!

Corporate Bills: Lakhs of Bills in Corp Hospitals Evidence
Share

Corporate Bills: కరోనా.. బ్లాక్ ఫంగస్.. కాదు జ్వరమైనా, కడుపు నొప్పి అయినా.., తలనొప్పి అయినా రోగానికి సమస్య కాదు. మనం ఉంటున్న ఈ చేతగాని వ్యవస్థలే రోగాలు.. రోగులే బాధితులు.. పాలకులే పాపాత్ములు.. కార్పొరేట్ శక్తులే గొప్పోళ్ళు..! “మీడియా ముందు కూర్చుని కార్పొరేట్ ఆసుపత్రులకు హెచ్చరిక.. ఎవరు ఎక్కడ పేషేంట్లు నుండి డబ్బులు ఎక్కువ వసూలు చేసినా చర్యలు తీసుకుంటాం” అని మంత్రులు అంటే పాపం అమాయకులు సంబరపడిపోతరు.. కానీ ఆ హెచ్చరిక తర్వాత పూటలోనే ఆ కార్పొరేట్ నుండి సంచులు వచ్చి వాలతాయని ఈ అమాయకుడు గ్రహించలేడు.. కార్పొరేట్ ఆసుపత్రులా దోపిడీ అందరికీ తెలుసు. కానీ పార్టీలకు ఫండింగ్.. మంత్రులకు మేపేది.. పాలకులకు తిండి పెట్టేది ఆ కార్పొరేట్ ఆసుపత్రులు.. గడిచిన కొన్ని నెలలుగా కరోనా మాత్రమే దేశాన్ని ఏలుతుంది. ఆ కరోనా కౄరత్వంలో రోగి మాత్రమే బాధితుడు .. మిగిలిన అందరూ బాధ్యులే..! అందుకే పక్కా ఉదాహరణలు ఈ బిల్లులు చూడండి..!

Corporate Bills: Lakhs of Bills in Corp Hospitals Evidence
Corporate Bills: Lakhs of Bills in Corp Hospitals Evidence

Corporate Bills: పేషేంట్ నంబర్ – 1 : 22 లక్షల బిల్లు ఎలాగంటే..!?

పేషేంట్ పేరు : ఖాజా హాసముద్దీన్… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. చెల్లించిన మొత్తం బిల్లు రూ. 22 లక్షలు. ఈ మొత్తం ఎలా అంటే..!? రూము కోసం 4,20,000…, మెడిసిన్, పరికరాల కోసం రూ. 11,50,000…, కన్సల్టేషన్ కోసం రూ. 4,90,00.., ప్రొఫెషనల్ చార్జీల పేరిట మరో రూ. 90,000 వేశారు. దోపిడీ కి ఇది ఒక సాక్ష్యం..! మరొకటి చూడండి..!

పేషేంట్ పేరు : అన్నదెవర శ్రీనివాస్ చారి. హైదరాబాద్ లోని నాగోల్ కూడలి వద్ద ఉన్న “సుప్రజ ఆసుపత్రి”లో గత నెల 13 న చేరారు. ఈనెల 14 న డిశ్చార్జి అయ్యారు. మొత్తం బిల్లు రూ. 23,65,000/-..! ముగ్గురు వైద్యులకు కన్సుల్టేషన్ ఫీజు రూ. 245000, ఐసోలేషన్ చార్జీలు 660000, జనరల్ వార్డు చార్జీలు 225000, సర్వీస్ చార్జీలు 420000, మెడికల్ పరికరాల చార్జీలు 763000… ఇలా మొత్తం 2365000 వేశారు. చూసారా..!? నెల రోజుల కరోనా ట్రీటుమెంట్ కి ఎంత వసూలు చేశారో..! సుమారుగా రోజుకి 80000 వరకు వేశారు. ఇదీ కార్పొరేట్ దోపిడీకి ఒక ఉదాహరణ..!

Corporate Bills: Lakhs of Bills in Corp Hospitals Evidence
Corporate Bills: Lakhs of Bills in Corp Hospitals Evidence

తనిఖీలు ఉండవు.. ఉన్నా మామూళ్ల కోసమే..!

ఈ ఆసుపత్రుల బిల్లుల్లో జీఎస్టీ అని ఏమి ఉండదు. కాష్ మాత్రమే తీసుకుంటాం అంటారు. ఇలా చాలా రకాల షరతులు ఉంటాయి. ప్రాణభయంతో రోగులు చెల్లించక తప్పదు. సరే.. ఆసుపత్రులు ఇంత దోచుకుంటుంటే ప్రభుత్వాలు, అధికారులు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు.. డబ్బు ఎవరికీ చేదు కాదు.. అధికారులు తనిఖీలకు అని వెళ్ళినప్పుడు మేనేజ్ కోసం ప్రత్యేకంగా కొంత నిధిని ఉంచుతారు. ప్రతీ పేషేంట్ బిల్లుపై 25% కమీషన్లు రూపంలో బయటకు వెళ్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రతీ ఆసుపత్రి బిల్లుల్లో 25% కమీషన్ రూపంలో అధికారులకు, పాలకులకు చేరుతుంది. అందుకే ఈ పాపముల;ఓ అందరికీ వాటా ఉంటుంది. కరోనా వచ్చింది పెదాలను చంపడానికి.. ఆసుపత్రులకు కాసులు కురిపించడానికి.. పాపలకులకు ఈ రూపంలో నిండడానికి మాత్రమే కరోనా వచ్చినట్టుంది..!!

ఓ సింపుల్ లెక్క.. ఈ ఆసుపత్రులు నెలకు రూ. 5 కోట్ల వరకు ఇలా అక్రమఆదాయం సంపాదించినా.. రూ. కోటి మామూళ్ల రూపంలో పోయినా అప్పుడప్పుడూ “ఇదిగో మేము తనిఖీలు చేస్తున్నాం, ఫైన్లు విబేస్తున్నాం అంటూ కోర్టులకు, వ్యవస్థలకు లెక్కల్లో చూపించడానికి ఫైన్ రూపంలో రూ. 10 లక్షలు పోయినా… నిర్వహణ, జీతాలకు రూ. 2 కోట్లు పోయినా… మిగిలినది మొత్తం సంపాదనే.. అందుకే కరోనా పాపం మొత్తం కార్పొరేట్ జేబుల్లోదే..!


Share

Related posts

టీడీపీలో రాజీనామా చేసేదెవరు?రాజీనామా చేసి గెలిచేనేతలెవరు?

Special Bureau

జగన్ ప్రభుత్వానికి మరో ట్విస్ట్ : టోల్ పై లారీ యజమానులు గరంగరం

Special Bureau

అంత అవ‌మానిస్తారా… హ‌రీశ్ రావు పేరు చెప్పి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar