NewsOrbit
Featured

House shifting : చక్రాలు లేకుండా స్థలం మారిన గుడిసె..?

people-shift-house-foot-nagaland-village-viral-social-media

House shifting : సాధారణంగా మనం ఏదైనా ఒక పెద్ద వస్తువును ఒకచోట నుంచి మరొక చోటుకు మార్చాలంటే కొంత మంది సహాయం తప్పనిసరిగా ఉంటుంది. చిన్న పని నుంచి మొదలుకొని పెద్ద పని వరకు అందరూ కలిసికట్టుగా పని చేస్తే ఆ పనిలో ఉన్నటువంటి అలసట మనకు కనిపించదు.”ఐక్యమత్యమే మహాబలం”అనే సామెత ప్రస్తుతం నాగాలాండ్ లోని గ్రామ ప్రజలకు సరిగ్గా సరిపోతుంది. నాగాలాండ్ లోని ఒక గ్రామంలో గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఏకమై ఒక గుడిసెను ఒకచోట నుంచి మరొక చోటుకు ఎంతో సునాయాసంగా తరలించిన ఘటన ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే…

people-shift-house-foot-nagaland-village-viral-social-media
people-shift-house-foot-nagaland-village-viral-social-media

నాగాలాండ్ లోని ఒక గ్రామంలో ఒక గుడిసె కొన్ని కారణాల వల్ల ఒకచోట నుంచి మరొక చోటుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆ గుడిసెను నాలుగువైపుల చేతులతో పట్టుకొని కాలినడకన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, “ఐక్యమత్యమే మహాబలం అని నాగాలు మనకు చూపించే వీడియో ఇది. నాగాలాండ్‌లోని ఓ గ్రామంలో హౌస్ షిఫ్టింగ్ చాలా పురోగతిలో ఉంది”. అంటూ ఒక కామెంట్ ను కూడా జతచేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సుమారు తొమ్మిది వేలకు పైగా నెటిజనులు ఈ వీడియోని చూశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “చక్రాలు లేకుండా స్థలం మారిన గుడిసె”, “గుడిసెకు కాళ్లు వచ్చాయా”?, “చాలా అద్భుతం” అంటూ ఒక్కొక్కరు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula