తెలంగాణ సర్కార్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల విషయంలో ఇటీవలి కాలంలో కేసీఆర్ పదేపదే అది రాష్ట్రాల హక్కు అని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితిలోనూ 50 శాతానికి మించకూడదని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టివేసింది.