వంకాయ రుచికరంగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. సాధారణంగా కొందరికి వంకాయ అంటే అసలు పడదు. దురదలు వచ్చే ప్రమాదం ఉంటుందనివంకాయను అంతంగా తీసుకోరు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది. ఆ ఒక్క కారణం తప్పా.. మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది. అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు.
వంకాయ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలివే:
వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
వంకాయ శరీరంలో కొవ్వులను కరిగించి ,రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది.
వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.
వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఉబ్బసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది.
వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
శరీరంలోని కణాలు.. క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా కాపాడుతుంది.
వంకాయలో సోడియం తక్కువ. కాబట్టి.. బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు.
పంటి సమస్యలను నివారిస్తుంది