diabetes: మారుతున్న జీవన విధానంలో ఎన్నో సమస్యలు, మరెన్నో రోగాలతో ఎంతో మంది సతమతమవుతున్నారు.ఈ రోజుల్లో ఎంతో మందిని పీడిస్తున్న రోగం డయాబెటిస్. బ్లడ్ లో షుగర్ లెవల్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈ డయాబెటిస్ వస్తుంది. సాధారణంగా షుగర్ ఫ్లక్చుయేషన్ నార్మల్‌గా అనిపించొచ్చు. కానీ అది మన శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో దీన్ని గుర్తించి కంట్రోల్ చేయాలి. లేకపోతే పలు సమస్యలు తప్పవు.
షుగర్‌కు మెడిసిన్ తీసుకోవడం ఇప్పుడు చాలా సులభం. అయితే మెడిసిన్ తీసుకోవడం కంటే.. ఆహార పద్ధతుల్లో మార్పులు చేసి.. దీన్ని కంట్రోల్ చేయడం మరీ ఉత్తమం. ఆ పద్దతుల్లో కలబంద మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ఈజీగా కంట్రోల్ చేయగలదు. ఈ కలబంధను తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
కలబంద జ్యూస్ లేకుంటే జెల్‌తో బ్లడ్ లోని గ్లూకోజ్ లెవల్ ను తగ్గించొచ్చు. ఈ కలబందను పరిగడుపున తీనాలి. దీంతో బ్లడ్ లోని షుగర్ లెవల్స్ ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి. అలాగే బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దీని వలన సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉండవని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు.అలాగే అన్ని రకాల డయాబెటిస్ రోగులు కలబందను తినొచ్చు. దీంతో వాళ్లు షుగర్ లెవల్స్ ను ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికి వైద్యుని సలహాలు తీసుకోవడం చాలా మంచిది. డాక్టర్ సలహా మేరకు వీటిని తినడం మరీ ఉత్తమం.