హెల్త్

Born Baby: చంటి బిడ్డకు తల్లి పాలు ఎప్పటివరకు ఇవ్వాలో తెలుసా?

Share

Born Baby: అమ్మదగ్గర  పాలు
పుట్టిన బిడ్డకు   తల్లి పాలకు మించిన   ఆహరం లేదని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గుర్తించాయి. బిడ్డ అమ్మదగ్గర  పాలు  త్రాగడంవల్ల  వారిద్దరి మధ్య అనుబంధం బలపడడం తో పాటు   బిడ్డ ఎదుగుదలకు కూడా తల్లిపాలు బాగా  పనిచేస్తాయి.  చనుపాలల్లో    విటమిన్లు, ప్రొటీన్లు,ఖనిజాలు, కొవ్వు, నీరు సంవృద్ధిగా ఉంటాయి. తల్లి పాలలో వుండేలాక్టోఫెర్రీస్,  ఇమ్యూనోగ్లోబిన్స్, లాక్సోఫెర్సాడేస్  వంటివి  శిశువు ఆరోగ్యానికి  రక్షణగా ఉండడం తో పాటు  అంటువ్యాధులు సోకకుండా  కూడా చూస్తుంది. బిడ్డకు తల్లిపాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి.

Born Baby: కనీసం లో కనీసం

తల్లి పాలతో  బిడ్డకు  వాంతులు,  అజీర్ణవ్యాధులు,విరేచనాలు లాంటి అనారోగ్యా  సమస్యలు రావు. బిడ్డలో  చురుకుదనాన్ని పెంచి, వయస్సుకు తగినట్లుగా  ఎదగడం  చేస్తాయి.తల్లి  దగ్గర కడుపునిండా  పాలు తాగిన శిశువు రెండు మూడు గంటలసేపు  మత్తుగా నిద్రపోతుంది. వయస్సుకు తగిన బరువు కూడా  పెరుగుతుంది. కనీసం లో కనీసం మూడు నాలుగు నెలల వయస్సువరకైనా శిశువుకు తల్లిపాలు  ఇవ్వడం  తల్లీ బిడ్డల ఆరోగ్యానికి  రక్షణ కవచం లాంటిది. తల్లి బిడ్టకు పాలు ఇవ్వడం వల్ల  బిడ్డ  ఎదుగుల, ఆరోగ్యం మాత్రమే కాదు  తల్లి ఆరోగ్యానికి కూడా అది మేలు  చేస్తుంది.  బిడ్డకు  పాలు ఇవ్వడంవల్ల గర్భధారణ  తో   పెరిగిన బరువును చాల తేలికగా తగ్గించుకోగలుగుతారు.

అనారోగ్య కారణం

పోతపాలు తాగినవారికంటే తల్లిపాలు తాగే పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది  అని ఆరోగ్యపరంగా వీరు  మంచి ఫలితాల్ని పొందుతారు అని నిపుణులు తెలియచేస్తున్నారు.   ప్రపంచ ఆరోగ్య సంస్థతెలియచేసిన దాని  ప్రకారం  బిడ్డ  పెరుగుదలను, ఆరోగ్యాన్ని పొందాలంటే  మొదటి ఆరు నెలలపాటు    తల్లిపాలు మాత్రమే తాగించాలి.ఏమైనా అనారోగ్య కారణం ఉంటే తప్ప పాలు ఇవ్వకుండా ఉండకండి. ఇవ్వలిసిన సమయం లో పాలు ఇవ్వకుండా తర్వాత ఎన్ని ఇచ్చిన పెద్దగా ప్రయోజనము ఏమి ఉండదు అని గమనించండి.


Share

Related posts

Teenage: టీనేజ్ లోకి అడుగుపెడుతున్న పిల్లలలో వచ్చే శారీరక, మానసిక మార్పులు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయాలు!!

Kumar

Bad Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..!? అయితే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగతుందా..!?

bharani jella

Lizards: బల్లులను ఈ విధంగా తరిమి కొట్టండి!!

Kumar