NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

ఈ ఆహారం తీసుకుంటే 60 ఏళ్లు వచ్చిన 30 ఏళ్ల వారిలా ఉంటారు!

మనం ఆరోగ్యంగా ఉండాలని ఆహారం తీసుకుంటాం. అంతేకానీ మనం తీసుకున్న ఆహారం ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఎవరూ గమనించరు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా పూర్తి ఆహారపు అలవాట్లను కూడా మార్చేస్తున్నారు. దీనివల్ల, ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 

మనం తీసుకునే ఆహారం మన జీవన విధానాన్ని నిర్దేశిస్తోంది. అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే.

ఉదయం తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్ర లేవగా మొహం కడిగి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కి కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకుని తాగడం ద్వారా మన శరీరంలోని భాగాలు శుద్ధి చేయబడతాయి. ప్రతి రోజు ఒక అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా మన శరీరంలోని కొవ్వు చెమట రూపంలో బయటకు వెళుతుంది.

ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, ఇడ్లీ, దోస వంటివి తీసుకోవాలి. కాఫీ టీలకు బదులుగా, గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం మంచిది. లేదా ఒక గ్లాసు పండ్ల రసం తాగడం వల్ల అధిక శక్తిని కలిగిస్తుంది. ఒక గంట ఆగిన తర్వాత ఏదైనా పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో వీలైనంతవరకు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం, అధిక మోతాదులో కూరగాయలు, మీగడ లేని పెరుగును తీసుకోవాలి.

భోజనం అయ్యాక ఒక అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. అలాగేతిన్న వెంటనే నిద్రపోకూడదు. సాయంత్రం స్నాక్స్ గా ఏవైనా పండ్లు లేదా ఉడకబెట్టిన గింజలను తీసుకోవాలి దీనితో పాటు తక్కువ పరిమాణంలో ఒక కప్పు టీ తాగవచ్చు. రాత్రి భోజన సమయంలో ఒక చపాతీ లేదా కొద్దిగా రైస్ మాత్రమే తీసుకోవాలి. అదికూడా పడుకోవడానికి గంట ముందు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇలాంటి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.

వీలైనంతవరకు మైక్రోఓవెన్ లో చేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఇందులో చేయడంవల్ల ఆహారంలో ఉన్న పోషక పదార్థాలు మొత్తం నశించిపోతాయి. అలాగే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ల ను వీలైనంత వరకు తగ్గించాలి. వీటి ద్వారా అధిక బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు మొదలైనవి తలెత్తుతాయి. చూశారు కదా! ఈ ఆహారాన్ని తీసుకోండి.. ఆరోగ్యంగా.. యవ్వనంగా కనిపించండి!

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N