Mango Nuts: పండ్లకు రారాజు మామిడి.. వేసవి కాలం వచ్చిందంటే మామిడికాయల సీజన్ మొదలైనట్లే.. కమ్మటి వాసన కలిగిన ఈ కాయలు అమాంతం తినేయాలి అనిపిస్తుంది.. మామిడి కాయలు ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. సాధారణంగా మనం మామిడికాయ తిని అందులో ఉండే టెంకను పారెస్తున్నాం.. మామిడి టెంకతో కలిగే ఆరోగ్య లాభాలు గురించి తెలుసుకుందాం..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మామిడి టెంక లో మినరల్స్, విటమిన్స్, ఫ్యాటి యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. మామిడికాయ లో ఉండే టెంకలు తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని తీసుకోవటం రక్తంలో చక్కెర కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు మామిడి టెంకలు చాలా మేలు చేస్తాయి. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. మామిడి టెంక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. గుండె పోటు రాకుండా చేస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మామిడి టెంక పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మామిడి టెంక చూర్ణాన్ని తేనె లో కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. గొంతులో గరగర గొంతు నొప్పి తగ్గిపోతుంది. మామిడి టెంకను పొడిచేసుకుని జీలకర్ర మెంతుల పొడి తో సమానంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ అన్నంలో కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఈ పొడిలో ఉండే కాల్షియం దంతాలకు చాలా మేలు చేస్తుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.