NewsOrbit
హెల్త్

Potassium : శరీరానికి తగినంత పొటాషియం అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

lack-of-potassium-can-causeserious-health-problems

Potassium :  సాధారణంగా మనం తీసుకునే ఆహారం పోషక పదార్థాలతో నిండి ఉంటుంది. ఆహారంలో ఎన్నో రకాల విటమిన్స్, న్యూట్రియన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ విధమైన ముఖ్య పోషకాలలో పొటాషియం కూడా ఒకటి. మనం తీసుకునే ఆహారంలో అధిక శాతం పొటాషియం ఉండటం వల్ల కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండటానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది.మనం తీసుకునే ఆహారంలో సరైన పొటాషియం మన శరీరానికి అందకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకోసమే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తగ్గించి పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

lack-of-potassium-can-causeserious-health-problems
lack of potassium can causeserious health problems

మన శరీరానికి సరిపడినంత పొటాషియం అందాలంటే ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. అరటి పండ్లు, బత్తాయి, మునగాకు, కొత్తిమిర, కొబ్బరి నీళ్ళలో పొటాషియం శాతం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి రోజువారి పరిమాణం కన్నా కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత క్యాల్షియం అందుతుంది. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపోయే పొటాషియం అందుతుంది.

పొటాషియం లోపం వల్ల కలిగే అనర్ధాలు:

మనం తీసుకునే ఆహారంలో పొటాషియం శాతం తక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరానికి తగినంత పొటాషియం అందకపోవటం వల్ల గుండె జబ్బులు రావడం, రక్తప్రసరణ సరిగ్గా జరగక పక్షవాతానికి దారితీస్తుందని పలు అధ్యయనాలలో వెల్లడయింది. పొటాషియం లోపంతో ఉన్నవారు తరచూ నీరసం, అలసటతో కనిపిస్తుంటారు. వీరు ఎలాంటి పనులను చేయడానికి కూడా ఇష్టపడరు.రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉన్నవారికి విపరీతమైన కండరాల నొప్పులను కలిగి ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక మలబద్ధకానికి దారితీస్తుంది. అదేవిధంగా పొటాషియం తక్కువ అయినప్పుడు మన అరచేతులు అరికాళ్ళు మంటలు ఏర్పడి కొన్నిసార్లు స్పర్శ కూడా లేకుండా ఉంటుంది.ఇలాంటి సమస్యలన్నింటికీ అధిగమించాలంటే పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri