ప్రస్తుతం ఇమ్యూన్ సిస్టం వీక్‌గా ఉన్నవారే ఎక్కువ రిస్క్ లో ఉన్నారు. కాబట్టి ఆ హై రిస్క్ జోన్లో మనం లేకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో ఒక్కసారి చూద్దాం.
ఆల్కలైన్ డైట్ అంటే తాజా పండ్లూ, కూరగాయలూ, సోయా ఉత్పత్తులూ, గింజలూ, పప్పు ధాన్యాలూ, మజ్జిగా, పెరుగూ ఆల్కలైన్ డైట్ లోకే వస్తాయి. ఈ డైట్ లోకి రానివి ఏమిటీ అంటే పాలూ, పాల పదార్ధాలూ (మజ్జిగా, పెరుగూ తప్ప), మాంసాహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్స్. ఇవి తగ్గించి ఆల్కలైన్ డైట్ లో ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవటం పెంచితే సరైన ఆహారం తీసుకుంటున్నట్లే. ఈ ఫుడ్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. పీహెచ్ లెవెల్స్ ని బాలెన్స్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అల్లం, వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు.
స్వీట్ పొటాటో ..బ్రోకలి, క్యారెట్, పుట్టగొడుగులు, ఓట్స్, ఉల్లిగడ్డలు, పసుపు..పెరుగుఇవన్నీ ఇమ్యునిటీని పెంచుతాయి.ఆహారం లో కంపల్సరీగా బత్తాయిలూ, నిమ్మ, వంటి విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఉండాలి. వీటితో పాటూవెల్లుల్లి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి,ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎగ్స్, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ కూడా ఉండాలి. గ్రీన్ టీ, గోరు వెచ్చని నీరు వంటివి రోజువారీ తీసుకోవాలి. అసలు కావలసినంత నీరు తాగితే టాక్సిన్స్ అన్నీ బైటికి వెళ్ళిపోయి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకోలేకపోతే ఇమ్యూన్ సిస్టం వైరస్ తోనో, బాక్టీరియా తోనో ఫైట్ చెయ్యడం మానేసి ఒత్తిడి తో ఫైట్ చేస్తుంది. ఫలితం మనంతట మనమే డిసీజెస్ ని ఆహ్వానించినట్త్లు. వాకింగ్ కి వెళ్తారో, యోగా చేస్తారో… మీ ఇష్టం కానీ, వీలైనంత ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం.లాక్ డౌన్ తరవాత చాలా మందికి నిద్ర అలవాట్లు మారిపోయాయి. లేట్ గా పడుకుని లేట్ గా లేవడం చాలా మందికి అలవాటైపోయింది. కానీ, ఇలా స్లీప్ సైకిల్ దెబ్బ తినటం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టం బలహీన పడుతుంది. లాక్ డౌన్ ముందు మీకు అలవాటైన స్లీప్ టైమింగ్స్ నే ఇప్పుడు కూడా ఫాలో అవ్వండి. ప్రతి వ్యక్తి కీ ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అది కూడా రాత్రి త్వరగా పడుకుని పొద్దున్న త్వరగా లేస్తే ఆరోగ్యం అన్న విషయం మర్చిపోకండి.