ఒక్కో సీజన్లో ఒక్కో రకమైన ఆహార పదార్ధాలు లభిస్తూ ఉంటాయి. ఈ కాలంలో ముఖ్యంగా చిలకడ దుంపలు బాగా విరివిగా పండుతాయి. ఈ చిలకడదుంపలు తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి.పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు.చిలకడ దుంపలను ఉడికించుకుని తినాలి లేదంటే సన్నని మంట మీద కాల్చుకుని తినవచ్చు.ఈ దుంపలు చాలా తియ్యగా ఉంటాయి. రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్య
పరంగా కూడా వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి.చిలకడదుంప తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా..!
చిలకడదుంప యొక్క ప్రయోజనాలు :
చిలకడ దుంపలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, నియాసిన్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.వీటితో పాటుగా విటమిన్ ఎ కూడా చిలకడదుంపలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే చిలకడదుంప తింటే కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి.
జీర్ణక్రియ మెరుగుపరచడంలో :
ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. దీనిలో ఫైటోస్టెరాల్ గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. చిలకడ దుంపలలో ఉండే ఫైబర్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
వ్యాధినిరోధక శక్తి పెరుగుదల :
చిలకడదుంపలను తింటే మెదడుకు ఎటువంటి సమస్యలు రావు.వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిలకడదుంపలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఎటువంటి చర్మ సంబందింత వ్యాధులు రావు. అయితే చిలకడదుంపను ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రోజు తినకుండా వారానికి మూడు సార్లు తింటే సరిపోతుంది.