Job: అప్పటివరకు చేస్తున్న ఉద్యోగం మారాలి అని అనుకున్నప్పుడు…దానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకసారి గమనించుకోవాలి. కొత్త ఉద్యోగం కి అప్లై చేసే ముందు మీరు ఆ ఉద్యోగం చేయగలరా? లేదా? అన్న విషయం గురించి బాగా ఆలోచించాలి. పరిస్థితుల ప్రభావం తో జాబ్ మారదాం అని చేయలేని వాటికి వెళ్లకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ చేయగలను అనుకుంటే మాత్రమే మారాలి లేదా మీకు కావలిసినది దొరికే వరకు ఎదురు చూడాలి.అసలు జాబ్ ఎందుకు మారాలనుకుంటున్నారు .. మీ లక్ష్యాలేంటి అనేదాని మీద మీకు స్పష్టత ఉండాలి. దాన్ని బట్టి మీరు మీ అడుగులు వేయడం మంచిది.
మీరు ఒక కొత్త ఉద్యోగం కావాలని భావించినప్పుడు.. మీ నెట్ వర్క్ లోని వ్యక్తుల తో మాట్లాడుతూ ఉండండి.. వాళ్లతో మాట్లాడటం వల్ల మీకు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.మీరు ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగం లో చేరాలి అని అనుకున్నప్పుడు.. మీ సీనియర్లను కలిసి వారితో మాట్లాడటం మంచిది. మీ మార్పు గురించి వారితో చర్చించి వారి సలహాలు తీసుకుని ఆ తర్వాత మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ కెరీర్లో ఎదగాలనుకుంటే ఎప్పుడూ ఒకే ఉద్యోగంలో ఉండి పోకుండా మీ నెట్ వర్క్‌ని పెంచుకుంటూ , కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వంటివి చేయాలి.మీ బలాబలాల ను గుర్తించి వాటికి తగినట్లుగా మీ కెరీర్లో ముందుకు వెళ్లేవిధం గా ప్లాన్ చేసుకోండి.
మీకు కొత్త ఉద్యోగం వచ్చింది అని మీ పాత సంస్థలోని వారితో గొడవలు పెట్టుకోవడం అనేది మంచి పద్దతి కాదు. వారితో ఎప్పుడు ఫ్రెండ్లీ గా ఉండడం మంచిది. ఎందుకంటే మళ్లీ ఆ సంస్థలోనే మరో పొజిషన్లో చేరాల్సి రావచ్చు.. పరిస్థితులు మనం ఊహించలేము కాబట్టి వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.