చిన్న పిల్లలు కనిపిస్తే ముద్దు చేయని వారు ఎవ్వరు ఉంటారు. పిల్లల్ని ముద్దు చేయడా నికి ముద్దు లు పెట్టడానికి చాల బేధం ఉంది. ఇంకా చెప్పాలంటే పిల్లలని చూడగానే చాలామంది ఎత్తేసుకుని బుగ్గలపై,పెదవులపై కూడా ముద్దులు పెట్టేస్తుంటారు..దానికి పిల్లలు కూడా అడ్డుచెప్పారు. ఎందుకంటే వారి తల్లి దండ్రులు కూడా అలానే చేస్తుంటారు కాబట్టి.
పిల్లలకు ముద్దులు పెట్టే విషయం లో వారిని తాకే విషయంలో కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..మీ పిల్లల పెదవు మీద మీకు ముద్దు ఇచ్చే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి .. అది ఏంటి అలా చెప్తారు అని అనుకుంటున్నారా… ఎందుకంటే అది మీ పిల్లల జాగ్రత్తకోసమే చెప్తున్నాము అది ఎలాగో చూడండి.. శరీరంలో ఉండే పెదవులు, నోటి విషయంలో కొన్ని హద్దులు పాటించి తీరాలంటున్నారు… సైకాలజిస్ట్ ఛార్లెస్ రెజ్నిక్. తల్లి కానీ తండ్రి కానీ తమ పిల్లల పై ప్రేమ తో పెదవు ల పై ముద్దు పెడుతుంటారు..అది మీకు చాల తృప్తిని సంతోషాన్ని ఇవ్వవచ్చు.. కాని ఇది సరైన చర్య కాదు అనే చెప్పాలి.
ఎందుకంటే మీరు ఆలా చేయడం వలన బయటి వారు తమ పెదవుల పై ముద్దు పెట్టినప్పుడు పిల్లలు తిరస్కరించరు. అమ్మానాన్న పెడతారు కదా, కాబట్టి అది సరైనదేనేమో అందుకే బయటవాళ్ళు పెట్టారు అని పిల్లలు భావించే అవకాశం ఉంది.ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుండే తెలిసే లా వారికీ నేర్పి తీరవలిసిందే. దాని అవసరం కూడా ఎంతో ఉంది . మానవ మృగాలు బయట నుండే కాదు ఒక్కోసారి మన ఇళ్లలోనే ఉంటాయి .. అందరూ మంచి భావం తోనే ఉంటారని చెప్పలేం.. మేము చెప్పిన కూడా చిన్న పిల్లలకూ ఏమి అర్ధం అవుతుంది అని అనుకోకండి.
ప్రతి ఒక్కరికి తమ పిల్లదగ్గర సొంత పద్దతి ఉంటుంది. ఆ భావాలు వారికీ మీకు తెలుస్తాయి. అలాగే ఈ విషయం లోవారికి ట్రయినింగ్ ఇవ్వండి. వారు అర్ధం చేసుకోగలుగుతారు. ఎవరైనా పెదవులపై కానీ పెదవులతో కానీ ముద్దు పెట్టబోతే NO అని చెప్పడం ఇంటి నుండే అలవాటు కావలంటున్నారు రెజ్నిక్..ఎవ్వరు ముద్దు పెట్టుకున్న కేవలం చేతి వేళ్ళతో చిన్నగా బుగ్గ గిల్లి మాత్రమే పెట్టుకునే విధంగా ఉండేలా చూడండి.
ఎవ్వరైనాకూడా మొహమాట పడకుండా ఆ విషయాన్ని చెప్పేయండి .అలాగే అమ్మ తప్ప వేరే ఎవ్వరిని ప్రైవేట్ పార్ట్స్ తాకనివ్వకూడదని తెలియచెప్పడం ఎంతో అవసరం. మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న ఈ సమయంలో పిల్లలను ముద్దులకు దూరంగా ఉంచడం శ్రేయస్కరం..పిల్లల పెదవులపై, నోటిపై ఏర్పడే పుండ్లు , రకరకాల ఇన్పెక్షన్లు , అలెర్జీలు రావడానికి ఈ ముద్దులే ముఖ్య కారణం అనేది ఎంతో మంది డాక్టర్ల చెప్పే మాట ..కాబట్టి పిల్లల ఆరోగ్య రిత్యా, కానీ మానసికంగా కానీ వారిని బలపర్చడానికి ఉపయోగపడే ఈ సూచనని తప్పక అనుసరించండి .