NewsOrbit
న్యూస్

‘అవి ‘కూడా దక్కకపోతే చంద్రబాబుకు డిప్రెషన్ గ్యారెంటీ!

గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ఆ పార్టీ అధినేత చేపట్టారు. ముందుగా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలు పై దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Depression is guaranteed for Chandrababu if 'they' are not even touched
Depression is guaranteed for Chandrababu if ‘they’ are not even touched

నిజానికి ఒకప్పుడు రాయలసీమ టీడీపీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా తిరగబడింది.గ‌త ఎన్నిక‌ల్లో సీమ‌లోని నాలుగు జిల్లాల్లో క‌లిపి 8 ఎంపీ సీట్లు, 52 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క ఎంపీ సీటూ గెల‌వ‌ని టీడీపీ, మొత్తంగా మూడే మూడు ఎమ్మెల్యే సీట్లుగెలుచుకుంది. అందులోనూ చంద్రబాబు, బాల‌య్యను వ‌దిలేస్తే ప‌య్యావుల కేశ‌వ్ ఒక్కడే ఉర‌వ‌కొండ‌లో గెలిచారు. ఇది ఘటన అనుకుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలోని రెండు జిల్లాలు మీద ఆశలు లేవట. సీఎం సొంత జిల్లా అయిన కడప లో టిడిపి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

ఇంకా చెప్పాలంటే 2004 నుంచే క‌డ‌పతో టీడీపీ బంధం పోయింది. 2009, 2014 ఎన్నికల్లో క‌నీసం ఒక సీటు అయినా టీడీపీ గెలిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో అస‌లు పార్టీ ఖాతాయే తెర‌వ‌లేదు. క‌డ‌ప‌లో ఐదారుపార్టీకి బ‌ల‌మైన నేత‌లే లేని ప‌రిస్థితి. ఇక‌, క‌ర్నూలులో అంతో ఇంతో ప్రభావం ఉంటుంద‌ని అనుకున్నా.. సీనియ‌ర్లు ఎవ‌రూ పార్టీని న‌డిపించేందుకు ముందుకు రాలేని ప‌రిస్థితి.

2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే అక్కడ మూడు సీట్లు గెలిచిన టీడీపీగ‌త ఎన్నిక‌ల్లో సున్నా చుట్టేసింది. క‌ర్నూలులో గ‌త ఎన్నిక‌ల్లో చాలా మంది వారి వారి వార‌సుల‌ను రంగంలోకి దింపారు. వీరంతా ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక్కడ క‌నుచూపు మేర‌లో కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ పుంజుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.కాబట్టి కర్నూలు జిల్లా పై కూడా టిడిపి పెద్దగా ఆశలు లేవు అనంతపురం జిల్లా మాత్రం నిన్నటి వరకు ఆ పార్టీకి కంచుకోట.

అయితే జేసీ వంటి నేత‌లు కేసుల్లో ప‌డి కొట్టుమిట్టాడుతుంటే, ప‌రిటాల ఫ్యామిలీ ప్రజ‌ల్లోకే రాని ప‌రిస్థితి ఉంది. దీంతో అనంత‌పురంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులే చంద్రబాబుకి క‌నిపిస్తున్నాయి. ఇక‌, చిత్తూరులో ప్రస్తుత‌మున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను కాపాడుకుంటూనే త‌మ‌కు ప్రాధాన్యం లేని చోట్ల ఎద‌గాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. మొత్తంగా చూస్తే టీడీపీ రాయలసీమలో రెండు జిల్లాల్లో పూర్తిగా వదులుకొని మిగిలిన రెండు జిల్లాల పైన కొద్దిగా ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.

author avatar
Yandamuri

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju