NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

నిర్భయ న్యాయవాది ఏపీ లోకి…! నిందితులని కబడ్డీ ఆడేదాకా వదిలేలా లేదు

మన భారతదేశంలో ఆడపిల్లల పై అత్యాచారాలు జరగడం ఈ రోజుల్లో చాలా సాధారణ విషయం అయిపోయింది. చట్టాలను ఎంత కఠినతరం చేసినా కూడా మానవమృగాలు భయపడటం లేదు. ఇక అత్యాచారం జరిగి బాధితురాలు ప్రాణాలతో ప్రజల్లో ఆగ్రహం ఉప్పొంగుతుంది. సోషల్ మీడియాలో వీరావేశంతో స్పందిస్తారు చివరికి మొత్తం మరిచిపోతారు. ప్రభుత్వాలు కూడా ఆ వేడి ఉన్నంతవరకూ ఏదో చేస్తారు కానీ భవిష్యత్తు ప్రణాళికపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవు. ఇక ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏళ్లుగా విచారణకు నోచుకోని కేసులో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి.

 

ఆ కర్నూలు కేసు.. ఇంకా తేలలేదే….

మన రాష్ట్రం వారికి బాగా గుర్తుండిపోయే ఘటనలు అంటే నిర్భయ, దిశ. అలాంటి కొన్ని కేసులు విషయంలోనే సత్వర చర్యలు చోటుచేసుకున్నాయి. ఇక మిగతా కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. నిందితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తిరిగే కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఒక కేసు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు లో సుగాలి ప్రీతి అనే ఒక పేద పిల్లల హత్యాచార కేసు. ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపిన వారికి ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఈ దారుణం జరిగి ఏకంగా మూడేళ్లు దాటిపోయింది. ఈ ఉదంతంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు సరికదా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక జగన్ సర్కారు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

దిల్లీ లో దాగున్న సొల్యూషన్?

బాధితురాలి తల్లిదండ్రులు అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొద్ది నెలలు దీనిపై గట్టిగా పోరాడారు. గత ఏడాది కర్నూల్ లో పర్యటించి ఆ అమ్మాయి కోసం ఆందోళనలో కూడా పాల్గొన్నాడు పవన్. ఇక జగన్ సర్కారు ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. కానీ ఇప్పటిదాకా సిబిఐ వారు కూడా ఈ కేసుని టేకప్ చేయలేదు. దీనిలో ఎలాంటి పురోగతి లేదు. దాంతో తన కూతురుకి ఎలాగైనా న్యాయం జరగాలని ప్రీతి తల్లి ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోయారు. జంతర్ మంతర్ లో ధర్నా కోసం వెళ్లిన ఆమె ప్రఖ్యాత న్యాయవాది సీమా కౌశ్యా ను కలిశారు.

నెక్స్ట్ ఏంటి?

ఇప్పుడు సీమా ఈ కేసును తీసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిర్భయ కేసులో బాధితురాలు తరఫున ఏళ్ళతరబడి పోరాడి, ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా కేసును వాదించి, గెలిచి చివరికి నిందితులకు ఉరిశిక్ష అమలు చేసే వరకు అలుపెరగని న్యాయవాది సీమా. ఇక ఆమె ప్రీతి కేసు ని తీసుకోవడం…. ప్రీతి తల్లి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి లాయర్ ముందు గోడు వెళ్లబోసుకోవడంతో కదిలిపోయిన సీమ. ఈ రేప్ అండ్ మర్డర్ కేసు తీసుకుంది. ఈ కేసును సవాలుగా చేసుకుని నిందితులైన స్కూల్ యాజమాన్యం, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలకి శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబం వెల్లడించింది.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju