NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

YSRCP:  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన, టీడీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు పలువురు వైసీపీలో చేరారు. రాజోలు జనసేన మాజీ ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, అమలాపురం జనసేన మాజీ ఇన్ చార్జి రాజబాబు, ముమ్మడివరం ఇన్ చార్జి పితాని బాలకృష్ణ, పిఠాపురం మాజీ ఇన్ చార్జి ఎం శేషుకుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ తదితరులు ఇవేళ వైసీపీలో చేరారు.

తణుకులో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీలో చేరగా, జగన్ వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలానే పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గణపతిరావు కుమారుడు గణేష్ బాబు, మనవడు గణపతిరావు, టీడీపీ సీనియర్ నేత గంగరాజు తదితరులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తొలుత పి గన్నవరంకు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించి ఆ తర్వాత సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ అసంతృప్తులు వైసీపీలో జాయన్ అయ్యారు.

బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడుగా పేరు పొందారు. పదవీ విరమణ అనంతరం రాజేశ్వరరావు వైసీపీలో చేరారు. రాజోలు నుండి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో రాజోలు నుండి రాజేశ్వరరావుపై జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికారు.

రాపాక వైసీపీకి దగ్గర కావడంతో బొంతు రాజేశ్వరరావు అసంతృప్తికి గురైయ్యారు. ఆ నేపథ్యంలో 2021 జూలై 17న ఆయనను రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్డీ, రూరల్ వాటర్ సప్లై సలహదారుగా జగన్ సర్కార్ నియమించింది. అయితే నియోజకవర్గ వైసీపీలో రాపాక వరప్రసాద్ హవా కొనసాగుతుండటంతో బొంతు రాజేశ్వరరావు వైసీపీని వీడారు. వైసీపీకి, సలహాదారు పదవికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

దీంతో రాజోలు జనసేన ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. రాజోలు జనసేన అభ్యర్ధిగా అవకాశం లభిస్తుందని బొంతు రాజేశ్వరరావు ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కు టిక్కెట్ కేటాయించారు. దీంతో బొంతు రాజేశ్వరరావు జనసేన అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవేళ తన అనుచరులతో కలిసి జనసేనకు బైబై చెప్పారు. అనంతరం మరల వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju