NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Karthika Deepam 2 April 18th 2024 Episode: షాపింగ్ మాల్ లో శౌర్యని శోభ చూస్తుంది. ఆరోజు మా ఇంట్లో పూలు కోసిన పిల్లవి నువ్వే కదా అని దాని వెంట పడబోతుంటే శౌర్య పారిపోతుంది. నరసింహ వచ్చి ఏమైందని అంటే నీ కూతురు కనిపించిందని చెబుతుంది. అది ఇక్కడ ఉందంటే దీప కూడా ఇక్కడికి వచ్చిందనే కదా. దీప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండకూడదని శౌర్య చెబుతుంది. గుడి దగ్గర అంత గొడవ చేసిన పోలేదంటే దానికి ఎంత పొగరు ఈసారి గట్టిగా ఇవ్వాలని నరసింహ అనుకుంటాడు. దీపని పంపించకపోతే పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది.‌ దీప ని జుట్టు పట్టుకుని ని ముందుకు లాక్కొచ్చి చావగొడతానని అంటాడు. పిల్ల ఎటు పోయిందని నరసింహ వెతుకుతూ ఉంటాడు. కార్తీక్ శౌర్య కనిపించకపోయే సరికి కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు.

Karthika Deepam 2 April 18th 2024 Episode
Karthika Deepam 2 April 18th 2024 Episode

శౌర్య కోసం వెతుకుతూ కార్తీక్, నరసింహ ఒకరికొకరు ఎదురవుతారు. శౌర్య వాళ్ళని చాటు నుంచి చూసి పిలుస్తుంది. తండ్రిని చూసినా శౌర్య దగ్గరకు రాదని కార్తీక్ అనుకుంటాడు. మళ్ళీ నాన్న ఎలా ఉంటాడో తెలియదని చెప్పింది కదా మరి ఇతన్ని చూసి ఎందుకు భయపడుతుందని ఆలోచిస్తాడు. జ్యోత్స్న వచ్చి కార్తీక్ ని పిలుస్తుంది. దీంతో శౌర్యని తీసుకుని కార్తీక్ వెళ్లిపోతాడు. శోభ తల్లి రాకుండా కూతురు వచ్చిందేంటి? వాడు ఎవడు వాడు నీకు ముందే తెలుసా? నీ కూతురు నిన్ను చూసి కూడా నీ దగ్గరకు రాలేదేంటి? నువ్వే తండ్రివని తెలియదా అని శోభా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అది పుట్టిన తర్వాత నన్ను చూడలేదు. దీప కూడా చెప్పి ఉండదని అంటాడు. వాళ్లని వదిలేసినట్టు నన్ను వదిలేయవని గ్యారంటీ ఏంటని పుట్టింటికి పోతానని శోభ అంటుంటే ఆపుతాడు. వాళ్లని వదిలేసింది నీకోసమే కదా అంటాడు.

దీప , దాని కూతురు ఇక్కడ ఉండడానికి వీల్లేదని తెగేసి చెబుతుంది. దీప ఎక్కడ ఉందని నరసింహ ఆలోచిస్తాడు. జ్యోత్స్న పుట్టినరోజుకి చేయాల్సిన వంటల గురించి లిస్ట్ రాసుకుంటూ ఉంటుంది దీప. ఇక దీప గురించిన వివరాలు దశరథ అడుగుతాడు. మీ నాన్న నిన్ను ప్రేమగా చూసుకునే వాడా అంటే ప్రాణంగా చూసుకునే వాడని కళ్ళనిండా నీళ్లు తో చెబుతుంది. తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏదో ఒక రూపంలో మీ నాన్న నీకు దగ్గరలో ఉంటాడని చెబుతాడు. అదృష్టాన్ని ఇవ్వకపోయినా ఆనందాన్ని ఇవ్వగలం. దూరమైన మనిషిని కాదు ఎదురుగా ఉన్న మనిషిని గుర్తు చేసుకో అప్పుడు కళ్ళలో నీళ్లు కాదు నవ్వులు వస్తాయని ధైర్యం చెబుతాడు. శౌర్య నరసింహాని చూసి ఎందుకు భయపడుతుందని అనుకుంటాడు. కార్తీక్, శౌర్య వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు.

శౌర్య మూతికి ఐస్ క్రీమ్ అంటుకుంటే కార్తీక్ తుడుస్తాడు. అటుగా వెళుతున్న శోభా వాళ్ళని చూసి నీ కూతురికి వాడు సేవలు చేస్తున్నాడు ఏంటి? తండ్రివి నువ్వా అతడ అంటుంది. శౌర్యని జ్యోత్స్న మీ నాన్న ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. తెలియదు నేను ఎప్పుడూ మా నాన్నని చూడలేదని బాధగా చెబుతుంది శౌర్య. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అవన్నీ మనకు ఎందుకని కార్తీక్ అంటాడు. అనసూయ పనులు చేసుకుంటూ అతనిని తాను తిట్టుకుంటుంది. మల్లేష్ తో గొడవ పడి బాకీ తీర్చను ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పేసి వెళ్ళిపోతుంది. శౌర్య కొత్త బట్టలు తీసుకుని వస్తుంటే దీప ఎవరు కొనిచ్చారని అడుగుతుంది. ఇలాంటివి చేస్తాడని నేను ముందే చెప్పాను అని మనసులో తిట్టుకుంటుంది.

Karthika Deepam 2 April 18th 2024 Episode
Karthika Deepam 2 April 18th 2024 Episode

ఇప్పుడు దీన్ని కోప్పడితే బాధపడుతుందని సైలెంట్ గా ఉండిపోతుంది దీప. కార్తీక్ చాలా మంచివాడు. షాప్ లో ఉన్న బట్టలు కనిపించకపోతే నన్ను ఎత్తుకుని చూపించాడు. కార్తీక్ ఎత్తుకున్నప్పుడు కూడా నువ్వు ఎత్తుకున్నట్లే అనిపించింది. కార్తీక్ తన మూతి కూడా తుడిచాడని దీపకి చెబుతుంది శౌర్య. నేనంటే కార్తీక్ కి ఎంతో ప్రేమ.. నాన్న ఉంటే ఇలాగే చేసేవాడు కదా అంటుంది. ఇక దీప అలా మాట్లాడకూడదని కోపంగా అంటుంది. నా తండ్రిని దూరం చేసిన మనిషి అతను, మంచోడు నాన్న ఉంటే ఇలాగే చేసేవాడివని అంటే నేనేం చెప్పగలను. నువ్వు రోజు రోజుకి అతడికి దగ్గరగా అవుతున్నావు. నిన్ను అతడికి దూరంగా ఉంచడమే కాదు అతన్ని కూడా నీకు దూరంగా ఉండమని చెప్పాలని దీప మనసులో అనుకుంటుంది. కార్తీక్ దగ్గరకు వెళ్లి దీప సీరియస్ గా మాట్లాడుతుంది. ఎందుకు శౌర్యకి దగ్గర అవుతున్నావ్? తనతో ఎందుకు స్నేహం చేస్తున్నావని నిలదీస్తుంది. తనకి తోచిన సాయం చేస్తున్నానని అంటాడు కార్తీక్. అయితే నిజంగా చేస్తారా అంటుంది. అప్పుడు ఏది అడిగినా చేస్తానని కార్తీక్ అంటాడు.. అలా ఇక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N