NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Adimulapu Suresh-10th Exams: మంత్రివర్యా..! ఇంత జరుగుతున్నా పది పరిక్షలా..?

minister adimulapu suresh on 10th exams

Adimulapu Suresh-10th Exams: ఆదిమూలపు సురేశ్ Adimulapu Suresh-10th Exams: మళ్లీ ఓ ప్రకటనతో ముందుకొచ్చారు. ఇప్పటికే కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో పది పరిక్షలను రెండుసార్లు వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే.. కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఇక పరీక్షలను రద్దు చేస్తుందని భావించిన వారికి మంత్రి సురేశ్ మరో షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పది పరిక్షలు నిర్వహిస్తామని మలి ప్రకటన చేశారు. కరోనా తగ్గిన తర్వాత మరోసారి పరిస్థితులను సమీక్షించి పరిక్షలు నిర్వహిస్తామంటున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరికి వెళ్తోందనే వాదనలూ లేకపోలేదు. మంత్రి ప్రకటనపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల భవిష్యత్ కోసమే పరిక్షల నిర్వహణ అంటోంది.

minister adimulapu suresh on 10th exams
minister adimulapu suresh on 10th exams

రాష్ట్రంలోని పది విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడో మార్చి నెలలో జరగాల్సిన పరిక్షలు జూన్ వచ్చేస్తున్నా ఇంకా ఏమీ తేలలేదు. కరోనా తీవ్రత తగ్గుతుందని భావించినా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో రోజుకి 15వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది పరిక్షలపై పట్టు విడవడం లేదు. మరోసారి సమీక్ష చేసి పరిక్ష తేదీలు ప్రకటిస్తామని అంటోంది. ఒకవేళ జూన్ నెలలో పరిక్షలు నిర్వహిస్తే.. కరోనా తీవ్రత పెరిగితే.. ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలా కాకుండా పరిక్షలను జూన్-జూలైలో నిర్వహిస్తే వాల్యుయేషన్ ఎప్పుడు.. రిజల్ట్ ఎప్పుడు.. ఇంటర్ లో ప్రవేశాలెప్పుడు.. అనే ప్రశ్నలూ వస్తున్నాయి.

Read More:Andhra Pradesh: ఏపీ రాజకీయ చదరంగంలో పది పరిక్షలు..! ఎవరు ఒప్పు.. ఎవరు తప్పు..?

నిజానికి ఈసరికి విద్యార్ధులకు రిజల్ట్స్ కూడా వచ్చేసి.. ఇంటర్ ఏ కాలేజీలో, ఏ కోర్సు అని ఆలోచించే సమయం. అడ్మిషన్లు సగంపైగా జరిగిపోవాల్సింది. కానీ.. కరోనా అన్నింటినీ మార్చేసింది. కరోనా తీవ్రతను గుర్తించే కేంద్రం సీబీఎస్ఈ, ఆయా రాష్ట్రాలు పది పరిక్షలు రద్దు చేసి అప్పుడే సర్టిఫికెట్లు కూడా ఇచ్చేశాయి. దీంతో కొత్త తలనొప్పులు తెచ్చుకోలేకుండా ఆయా ప్రభుత్వాలు పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాయి. కానీ.. ఏపీ మాత్రం పరిక్షల నిర్వహణకే మొగ్గుచూపుతోంది. అన్ని ఏర్పాట్లు చేశాం.. జాగ్రత్తలు తీసుకున్నాం.. అంటున్న ఏపీ ప్రభుత్వం.. రివర్స్ లో ఏదన్నా జరగరానిది జరిగితే సమాధానం చెప్పుకోగలుగుతుందా? ప్రతిపక్షం విమర్శలకు సమాధానం చెప్తుందా? ప్రజు, విద్యారంగ నిపుణుల వ్యతిరేకత తట్టుకుంటుందా? అనేది ప్రస్తావనార్హం. మరి.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ఆలోచిస్తారో.. చూడాలి.

author avatar
Muraliak

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju