Pushpa 2 The Rule Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘పుష్ప-2’ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 101 నిమిషాల్లోనే టీజర్ వీడియోకు 500K లైక్స్ వచ్చాయి. అత్యంత వేగంగా ఐదు లక్షల లైక్స్ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకానుంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే టీజర్ లో ఒక్క డైలాగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
కానీ అల్లు అర్జున్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు కెరియర్ లో ఏ సినిమాలో వెయ్యని వేషం “పుష్ప 2″లో వేయడంతో.. సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. “పుష్ప” మొదటి భాగంలో అల్లు అర్జున్ డైలాగులు, మేనరిజం.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. స్టోరీ మరియు పాటలు అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఏకంగా రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ప్రపంచ స్థాయిలో అతి పెద్ద విజయం సాధించింది. దీంతో ఇప్పుడు రెండో భాగం మొదటి భాగం కంటే ప్రతిష్టాత్మకంగా దర్శకుడు సుకుమార్ చిత్రీకరిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతోంది. మొదటి భాగం అంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. పుష్ప మొదటి భాగం విడుదల చేసిన సమయంలో కరోనా ప్రభావం ఉంది. 2021 డిసెంబర్ నెలలో “పుష్ప” రిలీజ్ అయింది. ఆ సమయంలో వైరస్ ప్రభావం గట్టిగా ఉండటంతో… తెలుగు మినహా మరి ఏ భాషల్లో ప్రమోషన్ చేయలేదు. అయినా గాని ఊహించని విధంగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం విడుదలకు కనీసం మూడు వారాల ముందు నుండి భారీ ఎత్తున ప్రమోషన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్.