NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన “RRR” విడుదలయ్యి రెండు సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తారీఖు విడుదల చేస్తారని ప్రకటించారు. రెండు భాగాలుగా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. సరిగ్గా సినిమా 80% కంప్లీట్ అయ్యాక.. విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. ఈ కారణంగా ఏప్రిల్ నెలలో విడుదల కావలసిన “దేవర” మొదటి భాగం అక్టోబర్ నెలకి వాయిదా పడటం జరిగింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో “వార్ 2” షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం గత వారమే తారక్ ముంబాయి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ జిమ్ లో ఎన్టీఆర్ తో కలిసి బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతుల ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. అందులో ఫోటోకు ఫిల్టర్ వాడినట్లు స్పష్టంగా తెలుస్తుండటంతో చాలామందిని నెటిజెన్స్ ఎడిట్ చేశారా..? అంటూ ప్రశ్నించారు. దీంతో చైనా ఫోన్ వాడి సెల్ఫీ తీసా.. అందువల్లే ఇలా జరిగింది అంటూ ఊర్వశి రిప్లై ఇవ్వడం జరిగింది.
అయితే ఎన్టీఆర్ తో దిగిన ఫోటోకి “ఎన్టీఆర్ గారు మీరే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. మీ క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ప్రశంసనీయం. త్వరలో మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే దాదాపు నెల రోజులపాటు “వార్ 2” షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనంతరం “దేవర” బ్యాలెన్స్ వర్క్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో “దేవర” నుండి సాంగ్ విడుదల చేయటానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు టాక్. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించి కూడా అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.