Balakrishna: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలు బాలయ్య మరియు చిరంజీవి. వీరిద్దరి సినిమాల విషయంలో పోటీ పడినా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఆప్యాయత కూడా. కొన్ని దశాబ్దాల నుంచి వీరి సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం కూడా వీరిద్దరూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు.
ఇక తాజాగా చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ” విశ్వంభర ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే బాలయ్య హీరోగా.. దర్శకుడు బాబీ కాంబినేషన్లో ” కెరీర్ 109వ ” మూవీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. డైరెక్టర్ బాబీ చిరంజీవితో ” వాల్తేరు వీరయ్య ” మూవీ అనంతరం బాలయ్యతో చేస్తున్న మొదటి సినిమా ఇది.
ఇక అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవి ఈ సినిమాకి తన స్పెషల్ విషెస్ తెలియజేసినట్లు డైరెక్టర్ బాబీ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ మాట్లాడుతూ..” నేను బాలయ్య గారితో సినిమా స్టార్ట్ చేసినప్పుడు.. నాకు కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరంజీవి గారు.
అయనది చాలా గొప్ప మనసు. ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరిస్తారు ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో చిరంజీవి, బాలయ్య స్నేహం మళ్లీ బలపడనుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళ అభిమానులు. ఇక ఇదే కనుక నిజం అయితే ఇంకేం కావాలి.