Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏర్పడింది. “పుష్ప” సినిమా సృష్టించిన సంచలనాలకు.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం…. ఊహించని రేంజ్ లో విజయం సాధించడం జరిగింది. ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ జరుగుతుంది. మొదటి భాగం కంటే ఈ సినిమా ఎక్కువ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. బాగా అల్లరి పిల్ల అన్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అల్లరి వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంటిలో అదేవిధంగా బన్నీ ఆడియో వేడుకలలో..కూడా అర్హ బాగా అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటది. ఇటీవల గీతా స్టూడియో ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా స్టేజిపై చాలా అల్లరి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ ఇంటిలో కందిరీగలు రావడంతో…అల్లు అర్హ.. వాటి గురించి తనకి చెబుతున్న క్యూట్ మాటల వీడియో పోస్ట్ చేయటం జరిగింది. పైగా నేడు కూతురు పుట్టిన రోజు కావడంతో ఈ వీడియో పోస్ట్ చేసి కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కందిరీగ కథలు అంటూ.. హ్యాష్ ట్యాగ్ జత చేసి బన్నీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో అల్లు అర్హ చెబుతున్న మాటలకు నెటిజన్ లు భారీ ఎత్తున కామెంట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 17వ తారీకు “పుష్ప” విడుదల అయి ఏడాది కావస్తు ఉండటంతో కేరళలో మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజు “పుష్ప 2″కి సంబంధించి అప్ డేట్ ఇచ్చే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.
Happy Birthday to the cuteness of my life . #alluarha #కందిరీగకథలు 😂 pic.twitter.com/83hQt0iKMn
— Allu Arjun (@alluarjun) November 21, 2022