ఇటీవల క్రికెటర్ శ్రీశాంత్ నటుడిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బాటలోకి అడుగు పెట్టాడు మరో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఎడమ చేతి బౌలర్, బ్యాట్స్మెన్ అయిన ఇర్ఫాన్.. నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఏదో తెలుసా? కోలీవుడ్ సినిమా. చియాన్ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇర్ఫాన్ నటిస్తున్నాడు. మరి ఇర్ఫాన్ పాత్ర ఏంటి? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఇర్ఫాన్ నటుడిగా ఏ మేర ఆకట్టుకుంటాడో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడక తప్పదు.
previous post
next post