టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ విషయం గురించి గొప్పగా చెప్తే ట్రెండ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన చేసే యాడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా మహేశ్ సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషయం బాగా వైరల్ అవుతోంది. ఓ వెబ్ సిరీస్ గురించి ఆయన గొప్పగా చెప్పడమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
జర్మన్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ‘డార్క్’ అనే వెబ్ సిరీస్ గురించే మహేశ్ చెప్పింది. సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ ను బాగా తెరకెక్కించారని మెచ్చుకున్నాడు. ఆద్యంతం చాలా చక్కగా ఉత్కంఠగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ చూడాలనీ.. అదీ జర్మన్ భాషలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలని కోరాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో ‘డార్క్’ గురించి చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం మహేశ్ పోస్ట్ వైరల్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ ‘డార్క్’ బాగా ట్రెండింగ్ లో ఉంది. మహేశ్ ఈ మూవీకి మంచి రేటింగ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఇప్పుడు డార్క్ చూసే పనిలో పడ్డారు. ఎంతైనా తమ అభిమాన హీరో చెప్పాడంటే చేయకుండా ఉండరు. దీంతో ఇప్పుడు డార్క్ మూవీ ట్రెండింగ్ లో ఉంది.