Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్ డేట్ రానుంది. “పుష్ప” మాస్ జాతర ఈరోజు నుంచి మొదలుకానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ అప్ డేట్ ఏంటా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ 8వ తారీఖు అల్లు అర్జున్ బర్త్ డే ఉండటంతో ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు ఏదైనా సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. భారత దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. 2021లో విడుదలైన “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఫస్ట్ టైం అల్లు అర్జున్ పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా రిలీజ్ చేసి ఊహించని విజయం అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అప్పటికే ఆర్య, ఆర్య 2 సినిమాలు చేయడం జరిగింది. మూడో సినిమాగా “పుష్ప” భారీ అంచనాల మధ్య విడుదలయి నేషనల్ స్థాయిలో విజయం సాధించి ఫ్యాన్స్ కి ఊహించని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళింది. ఈ సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా గెలవడం జరిగింది. తెలుగులో ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా బన్నీ రికార్డు సృష్టించాడు.
“పుష్ప” మొదటి భాగం ప్రపంచంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాటల పరంగా డాన్స్ పరంగా స్టోరీ పరంగా డైలాగులు పరంగా అన్ని రకాలుగా.. ప్రాంతాలకు దేశాలకు భాషలకు అతీతంగా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగు ప్రపంచంలోనే ట్రెండ్ సెట్టర్ డైలాగ్ గా నిలిచింది. బన్నీ మేనరిజమ్స్ అందరిని ఆకట్టుకోవడం జరిగింది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల చేసిన భాషల్లో కంటే మరీ అధికంగా రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పుట్టినరోజుకు ముందుగానే సినిమా నుండి అప్డేట్ వస్తున్నట్లు మేకర్స్ హడావిడి చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.