కొన్ని సినిమాలు ఎప్పుడో విడుదల కావాల్సి ఉంటాయి. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడిపోతాయి. సంవత్సరాల తరబడి మరుగున ఉండిపోతాయి. నాలుగైదేళ్లకు వీటి గురించి అందరూ మరచిపోయిన తరుణంలో ఉన్నట్లుండి విడుదలకు సిద్ధం అంటూ వచ్చేస్తాయి. అలాంటి వాటిలో రాజశేర్ నటించిన అర్జున చిత్రం ఒకటి. తమిళ చిత్రానికి ఇది రీమేక్.
సి.కల్యాణ్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్, హ్యపీ మూవీస్ పతాకాలపై కన్మణి దర్శకత్వంలో కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం `అర్జున`. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మార్చి 15న సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. రాజశేఖర్ సరసన మర్యం జకారియా, సాక్షి గులాటి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యం వహించగా మధు నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
previous post
next post